నారా రోహిత్, నిత్యామీనన్ జంటగా గులాబి మూవీస్ పతాకంపై సి.వి.డ్డి నిర్మిస్తున్న చిత్రం 'ఒక్కడినే'. శ్రీనివాస్ రాగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా. చిత్రీకరణ 50శాతం పూర్తయింది. నిర్మాత మాట్లాడుతూ వికారాబాద్ అడవుల్లో నారా రోహిత్, ప్రతినాయకుడు గురుప్రీత్ సింగ్ తో పాటు ఫైటర్స్ పాల్గొనగా పోరాట సన్నివేశాల్ని మార్చి 26 నుంచి 31 వరకు చిత్రీకరించాం. ఈ పోరాట దృశ్యాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ఏప్రిల్ 2 నుంచి కథకు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఈ షెడ్యూల్ ఏప్రిల్ 12 వరకు కొనసాగుతుంది. ఇందులో నారా రోహిత్ తన గత చిత్రాలకు భిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు. నిత్యామీనన్ కీలక పాత్రలో నటిస్తోంది అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ 'ఫ్యామిలీ అనుబంధాల తీవ్రతను కొత్తకోణంలో చూపిస్తున్నాం. లవ్ యాక్షన్ లతో కూడిన కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది అన్నారు. నాగబాబు, చంద్రమోహన్, కోటశ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, జీవి, అలీ, శ్రీనివాసడ్డి, సత్యకృష్ణ, సుధ, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: చింతపల్లి రమణ, పాటలు: చైతన్యకృష్ణ, రామజోగయ్యశాస్త్రి, సంగీతం: కార్తీక్, కెమెరా: ఆండ్రు బాబు, ఎడిటింగ్: మార్తాండ్.కె. నిర్మాత: సి.వి.డ్డి, కథ-స్ర్కీప్లే-దర్శకత్వం: శ్రీనివాస్ రాగ.
| Share with Friends : |
| Share with Friends : |

Post a Comment