జూనియర్ ఎన్టీఆర్ 'దమ్ము' సినిమాలో త్రిష ప్రధాన హీరోయిన్‌గా నటిస్తే, సెకండ్ హీరోయిన్ కేరక్టర్ కార్తీక చేసింది. నిన్నటి తరం అందాల తార రాధ కుమార్తె అయిన కార్తీక తెలుగులో నాగచైతన్య సరసన చేసిన 'జోష్' సినిమాతో నాయికగా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఆడకపోవడం, గ్లామర్ పరంగా ఆకట్టుకోకపోవడంతో కార్తీక కెరీర్ తెలుగులో ముందుకు సాగలేదు. అయితే తమిళం నుంచి వచ్చిన డబ్బింగ్ సినిమా 'రంగం' ఆమెకి మంచి పేరుతెచ్చింది. అటు నటిగానూ, ఇటు గ్లామర్ పరంగానూ ఆమెకి మంచి మార్కులే పడ్డాయి.
దాంతో దర్శకుడు బోయపాటి శ్రీను దృష్టి ఆమె మీదపడి 'దమ్ము' అవకాశాన్ని సాధించిపెట్టింది. అయితే ఆ సినిమాకి సంబంధించి నిన్నటిదాకా త్రిషకు లభించిన ప్రచారం కార్తీకకు లభించలేదు. అయితే ఎప్పుడైతే 'దమ్ము' ఆడియో ఫంక్షన్ జరిగి ప్రోమోస్ బయటకు వచ్చాయో, అప్పట్నించీ కార్తీకకూ ప్రచారం మొదలైంది. ఎన్టీఆర్, త్రిష,కార్తీకపై చిత్రీకరించిన ఓ పాటలో ఎన్టీఆర్‌కి దీటుగా కార్తీక చేసిన డాన్సులు అదిరిపోయాయని అంటున్నారు.
అందులో కార్తీక డాన్సుల ముందు త్రిష డాన్సులు ఎందుకూ పనికిరాలేదని చెప్పుకుంటున్నారు.పాత్రపరంగా త్రిషకు ఎక్కువ ప్రాధాన్యమున్న సంగతి తెలుసు కాబట్టి డాన్సుల్లోనైనా ఆమెకంటే ఎక్కువ అనిపించుకోవాలనే ఉద్దేశంతో కార్తీక గొప్పగా స్టెప్పులేసిందనేది ఆ సినిమా యూనిట్ వర్గాల అభిప్రాయం. సినిమా విడుదలైతేగానీ ఎవరు ఎక్కువ మార్కులు కొట్టారో తెలీదు.
| Share with Friends : |
| Share with Friends : |

Post a Comment