తనిఖీల పేరుతో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌ను అమెరికాలోని న్యూయార్క్ కస్టమ్స్ అధికారులు షారుక్ ఖాన్‌ను 2 గంటలపాటు నిర్బంధించడంపై విదేశాంగ మంత్రి ఎస్ఎమ్ కృష్ణ మండిపడ్డారు. మరోవైపు షారుక్ ఖాన్‌ను నిర్బంధించడంపై అధికారులు క్షమాపణలు చెప్పారు. దీనిపై కృష్ణ స్పందిస్తూ.. నిర్బంధించడం... ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం న్యూయార్క్ కస్టమ్స్ అధికారులకు అలవాటైపోయిందని ధ్వజమెత్తారు.
షారుక్ నిర్బంధంపై సీరియస్‌గా స్పందించిన ఎస్ఎమ్ కృష్ణ హుటాహుటిన అమెరికాలోని భారత రాయబారి నిరుపమారావుతో సంప్రదించి షారుక్ నిర్బంధంపై వాకబు చేశారు. సంబంధిత అధికారులతో సంప్రదించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.
కాగా యాలె యూనివర్శిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించేందుకు షారుక్ ఖాన్, నీతా అంబానీతో ఓ ప్రైవేటు విమానంలో భారతదేశం నుంచి అమెరికా వెళ్లారు. విమానం దిగగానే షారుక్ ఖాన్‌ను ఎయిర్ పోర్టు అధికారులు తనిఖీల పేరుతో రెండుగంటలపాటు ఆయనను అక్కడే నిర్బంధించారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీతోపాటు వచ్చిన ఇతర అనుచర గణాన్ని వెంటనే అనుమతించిన అధికారులు, షారుక్ ఖాన్‌ను మాత్రం అడ్డగించారు. నీ ఎత్తెంత.. నీ రంగు ఏమిటి..? వంటి తిక్క ప్రశ్నలతో విసిగించారు. అలా రెండు గంటలపాటు రకరకాల ప్రశ్నలతో వేధించారు.
యాలె విశ్వవిద్యాలయంలో షారుక్ తన ప్రసంగాన్ని మధ్యాహ్నం 2 గంటలకు చేయాల్సి ఉండగా అధికారుల నిర్వాకంతో ఆయన ఎయిర్‌పోర్టులోనే ఉండాల్సి వచ్చింది. దీంతో సాయంత్రం 6 గంటలకు సభలో ప్రసంగం చేశారు షారుక్.
ప్రసంగంలో షారుక్ మాట్లాడుతూ... "నేను ఎప్పుడైనా నా గురించి నేనో పెద్ద హీరోని అని గర్వంగా ఫీలయితే.. వెంటేనే అమెరికా ట్రిప్ వేస్తా. ఇక్కడి కస్టమ్స్ అధికారులు నా స్టార్‌డమ్‌ను కిక్ చేస్తారు. అలా నా గర్వాన్ని అణిచివేస్తారు" అంటూ ఛలోక్తి విసిరారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment