కొలవెరీ డీ కుర్రాడిపై బాలీవుడ్ ఐటం గర్ల్ రాఖీ సావంత్ గుర్రుమంది. కొలవేరీ డీ పాటతో విశేష ప్రచారాన్ని పొందిన ధనుష్‌పై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటీవల ఓ కార్యక్రమంలో రాఖీ సావంత్‌తో కలిసి ధనుష్ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ధనుష్ దాన్ని రద్దు చేసుకున్నాడు. ధనుష్‌తో కలిసి ప్రదర్సన ఇవ్వడానికి సిద్ధపడిన రాఖీ సావంత్ తీవ్ర నిరాశకు గురైనట్లు కనిపిస్తోంది.
ధనుష్ తనను అవమానించాడని రాఖీ సావంత్ అంటున్నాడు. రాఖీ సావంత్‌కు దూరంగా ఉండాలని ధనుష్‌కు ఆయన సలహాదారులు చెప్పారని ఆమె ఓ ప్రముఖ వెబ్‌సైట్‌తో చెప్పింది. తాను వివాదాస్పద అమ్మాయినని వారు ధనుష్‌కు చెప్పారని ఆమె అన్నది. ధనుష్ వ్యవహారం చూసిన తర్వాత బాలీవుడ్ తారలు ఎంతో మంచివారని అర్థమైందని ఆమె చెప్పింది.సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, సంజయ్ దత్ వంటి బాలీవుడ్ నటులే కాకుండా కపిల్ దేవ్ వంటి క్రికెటర్లు కూడా తనతో కలిసి ప్రదర్శనలు ఇచ్చారని, దానివల్ల తామేదో తక్కువై పోయామని వారు భావించలేదని రాఖీ సావంత్ అన్నది.
రజనీకాంత్‌పై ఆమె ప్రశంసలు కురిపించింది. రజనీకాంత్ తన కలల వ్యక్తి అని ఆమె చెప్పింది. రజనీకాంత్‌ను తాను ఎంతో గౌరవిస్తానని ఆమె చెప్పింది. ధనుష్‌కు నేను చాలా పెద్ద ఫ్యాన్‌ను అని, అతడు పాడిన ‘కొలవెరి డి’ పాట అద్భుతం, ఇటీవల అతడు ఓ స్టేజీ పెర్ఫార్మెన్స్‌లో అర్ధాంతరంగా తప్పుకోవడంతో చాలా అప్ సెట్ అయ్యాను అందరితో చెప్పుకుంటోంది. తనను అవమానించాడని కూడా అన్నది.
Post a Comment