Pages

Thursday, 26 April 2012

అప్పట్లో నూనె రాసుకుని చూపించా.. జనం తెగ చూశారు.. ఇలియానా

అందంగా కనిపించేందుకు ఇలియానా నూనె రాసుకుంటుందట. అంతేకాదు.. దేవదాస్‌లో ఒళ్ళంతా నూనె రాసుకుని నటించిందట. అప్పట్లో అది క్రేజ్ అనీ‌... మళ్ళీ అలా నూనె రాసుకుని చూపిస్తే... జనాలు చూడరు అని తెలివిగా చెబుతోంది ఇలియనా.

అందం గురించి మాట్లాడుతూ... అందంగా ఉన్నవాళ్లు మాత్రమే తమ అందాలను చూపించగలరనీ, అవి లేనివాళ్లు ఏం చూపిస్తారంటూ అడుగుతోంది. తన గ్లామర్ అందాల గురించి ఇలియానా చెపుతూ... చిన్నప్పటి నుంచి అబ్బాయిలా పెరిగాను. అబ్బాయిలు వేసుకునే దుస్తులే వాడేదాన్ని అంటూ చిన్ననాటి సంగతులు గుర్తు చేస్కుంది.

ముంబైలో పుట్టి పెరిగినా హిందీ సినిమాల్లో చేయలేకపోయా. అది ఇప్పుడు నెరవేరుతుంది అంది. మోడలింగ్‌ రంగంలో అడుగుపెడతానని అనుకోలేదు. అమ్మాయిలా స్కర్ట్స్‌ వేసుకునేదాన్ని కాదు. ఓసారి గోవాలో మార్క్‌ రాబిన్‌సన్‌ అనే వ్యక్తిని కలిశాను. ఆయన నాలో మోడల్‌ని గుర్తించారు. పట్టుబడి ఫొటో షూట్‌ చేశారు. ఆ తర్వాత మోడల్‌గా అవకాశాలు వచ్చాయి. ఆ వెంటనే సినిమాలు వచ్చాయి.

నేను నటించిన వ్యాపార ప్రకనటలు మంచి పేరు పొందాయి. తెలుగులో దేవదాస్‌ చిత్రం చేసేటప్పుడు భయపడ్డాను. కానీ అది ఊహించని విజయంతో వెనక్కు తిరిగి చూసుకోలేదని చెబుతోంది. గ్లామర్‌ గురించి చెబుతూ.. అందం ఉంటేనే చూపించడానికి అవకాశముంటుంది. అది లేనివాళ్లు చూపించేందుకు ఏమీ ఉండదు.

No comments:

Post a Comment