Pages

Thursday, 26 April 2012

జూన్ 12న రాంచరణ్-ఉపాసనల వివాహ ఘట్టం!

టాలీవుడ్ యువ మెగాస్టార్ రామ్ చరణ్ తేజ్-ఉపాసనల వివాహం మహోత్సవం జూన్ 12వ తేదీన అంగరంగ వైభవంగా జరుగనుంది. ఈ మేరకు వధూవరులకు చెందిన ఇరు కుటుంబాల పెద్దలు ముహుర్తాన్ని ఖరారు చేశారు. అయితే, కళ్యాణ వేదికను మాత్రం ఖరారు చేయాల్సి ఉంది. చెర్రీ వివాహానికి హైటెక్స్ లేదా ఎన్-కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్‌కు, అపోలో గ్రూపు ఆస్పత్రుల ఛైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి మనుమరాలైన ఉపాసనని ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించిన విషయం తెల్సిదే. ఇందులోభాగంగా జూన్ 12వ తేదీన వీరి వివాహం జరుగనుంది.

మే నెల మొదటివారంలో ఈ పెళ్లికి సంబంధించిన శుభలేఖల ముద్రణ పూర్తవుతుందని చిరంజీవి తరపు బంధువు ఒకరు వెల్లడించారు. ఈ వివాహాన్ని నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ కోటలో చేయాలని ప్రతాప్‌రెడ్డి కుటుంబం భావించినా.. సౌకర్యాలలేమి, అభిమానుల తాకిడి దృష్ట్యా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. 

No comments:

Post a Comment