Home »
» సమ్మర్ స్పెషల్ మూవీ ఏది.. రచ్చ...? దమ్ము..? గబ్బర్ సింగ్..? అధినాయకుడు..?
సమ్మర్ స్పెషల్ మూవీ ఏది.. రచ్చ...? దమ్ము..? గబ్బర్ సింగ్..? అధినాయకుడు..?
వేసవిలో టాలీవుడ్ వెండితెరను షేక్ చేసేందుకు మెగా కుటుంబం నుంచి రెండు.. నందమూరి కుటుంబం నుంచి మరో రెండు చిత్రాలు వస్తున్నాయి. సహజంగానే పంచ్ డైలాగులతో అదరగొట్టే నందమూరి హీరోల సినిమాలు ఒకవైపు విడుదలకు సిద్ధమవుతుంటే.. ఎంతో భారీ అంచనాతో గురువారంనాడు రామ్ చరణ్ తేజ రచ్చ విడుదల కాబోతోంది. రచ్చలో 'వానా వానా...' పాటకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ చిత్రంలోని పాటలు వేటికవే అన్నట్లుగా ఉన్నాయి. ఇక రామ్ చరణ్ మగధీర తర్వాత హిట్ కోసం మొహం వాచిపోయి ఎదురుచూస్తున్నాడు. ఇందుకోసం రచ్చలో ఎన్ని దెబ్బలు తగిలినా వాటన్నిటినీ ఓర్చుకుంటూనే షూటింగ్‌లో పాల్గొన్నాడు. రామ్ చరణ్ సరసన పాలకోవా లాంటి తమన్నా అందాలను ట్రెయిలర్లో చూసి కుర్రకారు వెర్రెక్కిపోతున్నారు. ఇక బిగ్ స్క్రీన్‌పై రామ్ చరణ్‌తో వానలో తడుస్తూ స్టెప్పులేసేటపుడు చూస్తే ఏమేరకు చిత్తవుతారో చూడాలి. మొత్తమ్మీద వేసవి రేసులో ముందుగా విడుదలవుతున్న రచ్చ స్టామినా మిగిలిన మూడు చిత్రాలను మించి ఉంటుందో లేదో చూడాల్సి ఉంది.
Post a Comment