యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, ఓటమంటూ ఎరుగని సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో గతంలో రూపొందిన ‘చత్రపతి’ చిత్రం ఏ రేంజ్‌లో హిట్టయిందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఆ రేంజ్ హిట్ ప్రభాస్‌కు ఇప్పటి వరకు మళ్లీ రాలేదు. మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్‌తో సినిమా తీయనున్నట్లు రాజమౌళి సంకేతాలు ఇవ్వడంతో త్వరలోనే వీరి కాంబినేషన్లో సినిమా ఖాయమని ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు.
అయితే అభిమానుల ఆశ ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఈ ప్రాజెక్టు మళ్లీ యూ టర్న్ తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. కారణం ఇద్దరూ పెద్ద ప్రాజెక్టులతో బిజీ షెడ్యూల్స్‌తో ఉండటమే. రాజమౌళి ప్రస్తుతం తన దృష్టంతా ‘ఈగ’ సినిమాపైనే పెట్టాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి నుంచి సినిమా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే రాజమౌళి సినిమా సినిమాకు కాస్త ఎక్కవ గ్యాపే తీసకుంటారు. ప్రభాస్ ఇమేజ్‌కు తగిన కథ తయారు చేయడానికి కొంత సమయం పడుతుంది.
ప్రభాస్ కూడా భారీ ఎత్తున రూపొందుతున్న‘రెబల్’ చిత్రంలో నటిస్తున్నాడు. డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్టు చిత్రాలు మంచి విజయం సాధించిన నేపథ్యంలో అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రం రూపొందుతోంది.
అటు రాజమౌళి ‘ఈగ’, ఇటు ప్రభాస్ ‘రెబెల్’ రెండు చిత్రాలపై కూడా భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే.....అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. ఈ నేపథ్యంలో అంచనాలను అందుకోలేక పోతే ఫెయిల్యూర్‌ను చవి చూడాల్సి వస్తుంది. ఈ కారణం కూడా ప్రభాస్-రాజమౌళి సినిమా యూటర్న్ వెనక కారణం అయి ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Post a Comment