హీరోయిన్ త్రిష మరో పెద్ద ప్రాజెక్టు దక్కించుకుని కుర్ర హీరోయిన్లందరికీ మరోసారి షాక్ ఇచ్చింది. రవితేజ హీరోగా రూపొందుతున్న‘సారొస్తారా’ చిత్రంలో త్రిష, అమల పాల్ హీరోయిన్లగా సెలక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో త్రిష మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా....అమల పాల్ సెకండ్ లీడ్ గా ఎంపికయినట్లు సమాచారం.
ఒకప్పుడు నెం.1 స్థానంలో వెలిగి పోయిన త్రిష...ఆ తర్వాత వరుస ప్లాపులు, అవకాశాలు తగ్గడంతో చాలా వెనక బడి పోయింది. మళ్లీ పుంజుకుని మెల్లిమెల్లిగా తన కెరీర్‌ని గాడిలో పెట్టుకుంటున్న అమ్మడు ఇటీవల ఎన్టీఆర్‌తో దమ్ము, తాజాగా రవితేజతో ‘సారొస్తారా’లో చాన్స్ కొట్టేయడం ఒకరకంగా కొందరికి షాకింగ్ న్యూసే.
గతంలో(2008) రవితేజ, త్రిష జంటగా వివి వినాయక్ దర్శకత్వంలో ‘కృష్ణ’ చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో ఈ ఇద్దరి మద్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. తాజాగా అదే రేంజ్‌లో ‘సారొస్తారా’ చిత్రంలో రవితేజ, త్రిష అలరించనున్నారట.
‘సారొస్తారా’ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో రవితేజ-పరశురాం కాంబినేషన్లో ‘ఆంజనేయులు’ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే.

Post a Comment