Home »
» ఎన్టీఆర్ 'దమ్ము' మరో సింహాద్రి అవుతుందా?
ఎన్టీఆర్ 'దమ్ము' మరో సింహాద్రి అవుతుందా?
ఫిలింనగర్‌లో దమ్ము చిత్రం గురించి పెద్ద చర్చ నడుస్తోంది. ఆడియో నాడు విడుదల చేసిన ట్రైలర్స్‌ను చూశాక... ఇదేదో మరో సింహాద్రి తరహాలో ఉంటుందని కన్‌ఫర్మ్ అయిపోయారు. దర్శకుడు బోయపాటి శ్రీను మంచి కాన్ఫిడెన్స్‌లో ఉన్నాడు. ఇప్పటికే పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలు సాగుతున్నాయి. ఈ నెల 15న తొలికాపీ సిద్ధం కానుంది. ఆ తర్వాత సెన్సార్‌కు వెళ్ళనున్నారు. ఈ చిత్రంలో హింస ఎక్కువగా ఉండటంతో దీనికి ఎ సర్టిఫికెట్ ఇస్తారనే ఆలోచనలో ఉన్నా... యు/ఎ సర్టిఫికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దమ్ములో ఎన్.టి.ఆర్ క్యారెక్టరైజేషన్ భిన్న షేడ్స్‌లో ఉంటుందని బోయపాటి శ్రీను తెలియజేస్తున్నారు. బాలయ్యతో సింహా చిత్రాన్ని తీసిన అనుభవంతోనే అంతటి పవర్‌ఫుల్ పాత్రను ఎన్.టి.ఆర్. మరోకోణంలో చూపించనున్నట్లు తెలిసింది. సింహా, సింహాద్రి చిత్రాలు కలిస్తే దమ్ము చిత్రమవుతుందని తెలియవచ్చింది.
Post a Comment