.
Home » » మహేష్-సుకుమార్ మూవీ ఫస్ట్ ట్యూన్

మహేష్-సుకుమార్ మూవీ ఫస్ట్ ట్యూన్

Written By Hot nd spicy on Tuesday, 10 April 2012 | 09:57

సూపర్ స్టార్ మహేష్ బాబు-దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన తొలి ట్యూన్ రెడీ అయింది. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ సమకూర్చారు. ఈ విషయమై దేవిశ్రీ తన ట్విట్టర్లో పేర్కొంటూ...సుకుమార్-మహేష్ బాబు సినిమా తొలి పాట కంపోజ్ చేశాం. సుక్కు భాయ్ చంద్రబోస్ గారితో కలిసి కంపోజ్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.

సుకుమార్ తన వరుస సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్‌నే సంగీత దర్శకుడిగా ప్రిపర్ చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆర్య, ఆర్య2, జగడం, 100% లవ్ చిత్రాలకు దేవిశ్రీనే స్వరాలు సమకూర్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలన్నీ ఆడియో పరంగా సూపర్ హిట్ అయ్యాయి.

మహేష్ బాబు-సుకుమార్ చిత్రం ఈచిత్రం ఈ నెల 23 నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. హైదరాబాద్‌లో ఈ నెల 23 నుంచి ఓ పాట చిత్రీకరణతో షూటింగ్ ప్రారంభించి, తదనంతరం థాయ్‌లాండ్, బ్యాంకాక్‌లో ఓ షెడ్యూల్ చేయనున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈచిత్రానికి ‘ఆగడు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

మహేష్‌తో ‘దూకుడు’ చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపుపొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌బాబు తొలిసారిగా నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. సుకుమార్ తయారుచేసిన స్క్రిప్ట్ మహేష్‌బాబుని బాగా ఇంప్రెస్ చేసిందని, ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ పూర్తి వైవిధ్యంగా వుండేలా సబ్జెక్ట్‌ను సుకుమార్ తీర్చిదిద్దాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

సినిమా కథ విషయానికొస్తే... గోవా బ్యాక్‌ డ్రాప్‌తో ఈ చిథ్ర కథ నడుస్తుందని తెలిసింది. అంతే కాకుండా ఇందులో మహేష్ బాబు తొలిసారిగా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మహేష్ బాబు ఇందులో లెక్చరర్ పాత్ర చేస్తున్నారని అంటున్నారు.
Share with Friends :


Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger