.
Home » » కాలక్షేపం బఠాణీలా నరేశ్ - శర్వానంద్ - శ్రియల 'నువ్వా నేనా'

కాలక్షేపం బఠాణీలా నరేశ్ - శర్వానంద్ - శ్రియల 'నువ్వా నేనా'

Written By Hot nd spicy on Friday, 16 March 2012 | 10:26

నటీనటులు: అల్లరి నరేశ్‌, శర్వానంద్‌, శ్రియ, బ్రహ్మానందం, శ్రీనివాసరెడ్డి, నర్సింగ్‌ యాదవ్‌, విమలా రామన్‌, కోవై సరళ తదితరులు

పాయింట్‌: ఇద్దరు అబ్బాయిలు ఒకే అమ్మాయిని ప్రేమిస్తే!

అల్లరి నరేశ్‌ చిత్రాలంటే కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసమే దర్శక నిర్మాతలు కసరత్తు చేస్తారు. దానికితోడు శర్వానంద్‌ వంటి మరో హీరోతో కలిసి చేస్తే... మరో గమ్యంలా ఉంటుందనో.. రకరకాల ఊహాగానాల మధ్య వచ్చిన సినిమా నువ్వా నేనా. ఇద్దరు హీరోలు ఇందులో నవ్వించే ప్రయత్నం చేశారు. దానికి శ్రియ గ్లామర్‌ తోడైంది. దర్శకుడు నారాయణ చేసిన ఆ ప్రయత్నం ఎలా ఉందో చూద్దాం.

కథ:
అమలాపురం అనే ఊర్లో జేబుదొంగ అవినాష్‌ (అల్లరి నరేశ్‌). అతని కజిన్‌ చంటి (అలీ)కూడా అదే బాపతు. ఓసారి ఇన్‌స్పెక్టర్‌ను మోసం చేసి పెద్ద మొత్తం డబ్బుతో హైదరాబాద్‌ పరారవుతారు. ఇక్కడ డా. నందిని(శ్రియ)ని ఓ సందర్భంలో చూసి ప్రేమించేస్తాడు. మరోవైపు ఓ జబ్బుతో ఆనంద్‌(శర్వానంద్‌) ఆసుపత్రిలో జాయిన్‌ అవుతాడు. నందిని పర్యవేక్షణలో ఉంటాడు.

ఆ సమయంలోనే ఆమెపై ఆనంద్‌ ప్రేమ పెంచుకుంటాడు. అలా ఒకరికొకరు ఆమె మెప్పుకోసం తాపత్రయపడుతుంటారు. వీరిద్దరు మధ్యలో మరో లోకల్‌ గూండా అక్కుభాయ్‌ (బ్రహ్మానందం) వస్తాడు. నందినిని చూసి మనసు పారేసుకుంటాడు. ఈ క్రమంలో నందిని నర్సు కోవై సరళతో బ్రహ్మానందంకు ఫిక్స్‌ చేస్తారు ఇద్దరూ. వారిద్దరూ నువ్వా నేనా అనుకున్న టైంలో నందిని లైఫ్‌లో మరో వ్యక్తి ఉన్నాడని తెలసుకుని షాక్‌కు గురవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది సినిమా.

హీరోల పెర్‌ఫార్మెన్స్‌
అల్లరి నరేష్‌ అభినయం గురించి చెప్పాల్సిన పనిలేదు. సింపుల్‌ టైమింగ్‌తో సింపుల్‌ డైలాగ్స్‌తో కామిక్‌ పండించాడు. నటనను చాలా జోవియల్‌గా చేసేశాడు. బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా క్యారెక్టర్‌ నరేష్‌ది. సీమ టపాకాయ్‌లా తన కామెడీని గుర్తు చేశాడు. శర్వానంద్‌ పాత్ర కాస్త సీరియస్‌గానూ, సరదాగా ఉంటుంది. జర్నీలో కాజువల్‌గా సీరియస్‌నెస్‌ను చూపించిన శర్వానంద్‌ నువ్వా నేనాలో కొత్తగా కన్పిస్తాడు. అమాయకత్వంతో కూడిన ఆయన ఫేస్‌కు ఈ పాత్ర కొత్తగా ఉంది.

శ్రియ పాత్ర ఇద్దరికీ సమాధానం చెప్పే పాత్ర. కొన్ని సందర్భాల్లో సెక్స్‌అప్పీల్‌ ఉంది. యూత్‌ను ఆకట్టుకునేట్లుగా ఉన్నాయి. గతంతో పోలిస్తే ఇందులో సరదాగా సాగుతుంది. వీరితోపాటు బ్రహ్మానందం పాత్ర కొత్తది కాకపోయినా ఓకే అనిపించేలా ఉంది. కోవై సరళతో కాంబినేషన్‌ ఓకే. వారిద్దరి ప్రేమ ట్రాక్‌ కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌. విమలారామన్‌ ఐటంసాంగ్‌లో తళుక్కుమంటుంది. సెక్సీ కళ్ళతో అందరినీ ఆకట్టుకుంది.

టెక్నికల్‌ వ్యాల్యూస్‌:
చెప్పాలనుకున్నది చాలా కూల్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు నారాయణ. కొన్ని సన్నివేశాల్లో లాజిక్కులు దొరక్కపోగా, నెరేషన్‌ ఇప్పటి ట్రెండ్‌కు తగినట్లు చాలా ఫాస్ట్‌గా సాగుతుంది. కామిక్‌ చిత్రాల్లో స్క్రీన్‌ప్లే పెద్ద బాధ్యత తీసుకుంటుంది. దానిపై నారాయణ శ్రద్ధ పెట్టాడు. సంభాషణలలో సూర్య తనదైన ముద్ర వేసుకున్నాడు.

ఇద్దరు హీరోలకు తగినట్లు సంభాషణలు రాశాడు. శివేంద్ర కెమెరా పనితనం ఫర్వాలేదు. మార్తాండ్‌ కె. వెంకటేష్‌ ఎడిటింగ్‌ బాగానే ఉంది. భీమ్స్‌ సంగీత దర్శకుడు బాణీలు హమ్ చేసేవిగా ఉన్నాయి. అందులో 'సర్‌....' అనేది ఇప్పటికే హిట్‌ అయింది. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ రొటీన్‌గా ఉంది. ఎస్‌.వి.కె. సినిమా నిర్మాణపు విలువలు బాగా కన్పించాయి.

సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ సంగతులు:
ఈ సినిమాకు ఓ కథ ఉంది. హిందీ చిత్రం 'దీవానా మస్తానా'ను పోలి ఉండటం. ఈ విషయాన్ని రిలీజ్‌కు ముందు చిత్ర దర్శకుడు నారాయణ ఖండించారు. కానీ సినిమా చూశాక అందులోని ప్రధాన భాగం తీసుకున్నాడు. మన నేటివిటికి తగినట్లు రెండు గంటలు నవ్వించే ప్రయత్నం చేశారు. శర్వానంద్‌, నరేష్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ఏదో కొత్తగా ఉంటుందనే కంటే ఇద్దరూ కలిసి నవ్వించే ప్రయత్నం చేయాలని చేసిన ప్రయత్నమిది.

కథ ఎక్కడిదైనా దాన్ని చెప్పే విధానం కొత్తగా చూపించడమే దర్శకుడు పని. దాన్ని ఈ దర్శకుడు చేసి చూపించాడు. ఇది ఒక క్లాస్‌ అనే భేదం లేకుండా అందరినీ కాసేపు రిలాక్స్‌గా నవ్వించే ప్రయత్నం చేస్తుంది. కమర్షియల్‌ అంశాలు ఉన్న ఈ సినిమా ఓ కాలక్షేపపు బఠానీలా ఉంది.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger