హీరోయిన్ జనీలియాపై కేసు నమోదు చేసి విచారణ జరుపాలని నాంపల్లి కోర్టు సైఫాబాద్ పోలీసులను శుక్రవారం ఆదేశించింది. బాలాజీ అనే న్యాయవాది వేసిన పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే...
జెనీలియా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న అంజని పుత్ర ఇన్ ఫ్రా స్ట్రక్చర్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కస్టమర్లను రూ. లక్షల్లో మోసం చేసింది. దీంతో బాలాజీ అనే న్యాయవాది నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. జనీలియా ఆ సంస్థలో డైరెక్టర్‌గా ఉండటంతో పాటు, ఆమె ప్రచారం చేయడం వల్లనే తాము ఆ సంస్థను నమ్మి ఫ్లాట్ల కోసం డబ్బులు చెల్లించామని, జెనీలియా తమను తప్పుతోవ పట్టించిందని, సంస్థ చేసిన మోసానికి పూర్తిగా జెనీలియా బాధ్యత వహించాలని బాధితులు అంటున్నారు.
సదరు సంస్థ ఫ్లాట్లు కట్టిస్తామని చెప్పి కస్టమర్ల నుంచి రెండేళ్ల క్రితం రూ.150 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే రెండేళ్లు గడిచినా ఎలాంటి నిర్మాణాలు జరుగక పోవడంతో రూ. 48 లక్షలు ఖర్చు చేసి రెండు ప్లాట్లు కొనుగోలు చేసిన చట్టా తిరుపతయ్య అనే వ్యక్తి న్యాయవాది ద్వారా కోర్టు ఆశ్రయించారు. ఈ కేసులో జెనీలియాతో పాటు ఆ సంస్థకు సంబంధించిన ఐదుగురు ప్రముఖులపై కేసు నమోదు చేసి పూర్తి వివచారణ జరుపాలని కోర్టు ఆదేశించింది.

Post a Comment