వెంకటేష్,మహేష్ కాంబినేషన్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటిలో జరుగుతోంది. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో దిల్ రాజు చిత్రం గురించి మాట్లాడారు. ఆయన చిత్రం కాన్సెప్టు గురించి చెపుతూ...ఉమ్మడి కుటుంబంలో అనుబంధాలూ ఆప్యాయతలూ చూసి ఎంతకాలమైంది? ఉద్యోగం పేరుతో ఒకరు రెక్కలు కట్టుకొని విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇంకొకరిది పట్నవాసం.
ఇంటిల్లిపాదీ మళ్లీ కలుసుకోవాలంటే పండగో, పెళ్లిపిలుపో రావాల్సిందే. అప్పుడు కూడా సెలవులు దొరికితేనే! అందుకే బాబాయ్, పిన్ని, వదిన, మేనత్త... ఇలాంటి పిలుపులకు దూరమైపోతున్నాం. ఆరు బయట వెన్నెల్లో కబుర్లు చెప్పుకొనే రోజులు మర్చిపోతున్నాం. మళ్లీ అలాంటి వాతావరణం మా సినిమాలో చూడొచ్చు అన్నారు. అలాగే చిత్రంలో వెంకటేష్, మహేష్‌బాబులు అన్నదమ్ములుగా నటిస్తున్నారు. వారిద్దరిపై వచ్చే సన్నివేశాలు హృదయానికి హత్తుకొంటాయి.
సీత పాత్ర కథలో చాలా కీలకం. ప్రకాష్‌రాజ్ మరోసారి ఓ ఉదాత్తమైన పాత్రలో కనిపిస్తారని అన్నారు.సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో మహేష్‌బాబు, సమంత తదితరులపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సంగీతం: మిక్కీ జె.మేయర్, ఛాయాగ్రహణం: గుహన్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.

Post a Comment