బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం తన ప్రాణ స్నేహితురాలు తమన్నాశర్మ వెడ్డింగ్ పనుల్లో బిజీగా గడుపుతోంది. వీళ్ల మధ్య 12 ఏళ్ల బలమైన స్నేహం ఉంది. తన సినిమాలకు సైతం గ్యాప్ ఇచ్చి అన్ని విషయాల్లో తన స్నేహితురాలికి చేదోడు వాదోడుగా ఉంటోంది. పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన ప్లాన్స్ కూడా ప్రియాంకనే చూసుకుంటోంది. ఈ సందర్భంగా మీడియా ఆమెను మీ పెళ్లి ఎప్పుడు? అని అడగ్గా...నాకు ఈడు జోడు అయిన మంచి మగాడు దొరకాలిగా అంటోంది. అంతే కాదు... అతను ఎప్పుడు దొరికితే, అప్పుడే పెళ్లి అంటూ తేల్చి చెప్పింది.
ప్రస్తుతం ప్రియాంక చోప్రా అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న ‘బర్ఫీ’ చిత్రంలో నటిస్తోంది. ఈచిత్రం షూటింగ్ ప్రస్తుతం డార్జిలింగ్ మరియు ముంబైలలో జరుగుతోంది. ఆమె నటించిన తేరీ మేరీ కహానీ చిత్రం కూడా విడుదలకు సిద్ధం అవుతోంది. మరో వైపు క్రిష్-3 చిత్రంలోనూ ప్రియాంక హీరోయిన్‌గా ఎంపికైంది. ప్రియాంక ఇటీవల నటించిన డాన్ 2 చిత్రం ఓ మోస్తరు విజయం సాధించింది. అగ్నిఫథ్ సినిమా మంచి విజయం సాధించినా...ఈ రెండు చిత్రాల్లోనూ ఆమె పాత్రకు సరైన గుర్తింపు రాలేదు. దీంతో హీరోయిన్ల రేసులో కరీనా, కత్రినా లాంటి వారితో వెకబడి పోయింది.
Post a Comment