బాలీవుడ్ కత్తి లాంటి పిగర్ కత్రినా కైఫ్ ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుంటోంది. అయితే ఉన్నట్టుండి మార్సల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సిన పనేమిటి? ఏమైనా సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నలకు ఆశ్యర్య పరిచే సమాధానం ఇచ్చింది. ‘‘దానికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదు, నేర్చుకోవాలనిపించింది అంతే. సినిమాల్లో పని కొస్తుంది కదా...అంతేకాక సెల్ఫ్ డిఫెన్స్ కీ పని కొస్తుంది. పైగా నాకు చిన్నప్పటి నుంచి బాండ్ గాళ్ అనిపించుకోవాలని కోరిక. అందుకే నేర్చుకుంటున్నాను’’ అని చెప్పింది.
అయితే క్రతినా మాటలను బట్టి ఈ అమ్మడు హాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నిస్తోందని, జేమ్స్ బాండ్ చిత్రాల్లో నటించాలనే కోరికతో ముందుకు సాగుతోందని చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ తర్వాత హాలీవుడ్డే.., మరింత పైకి ఎదగడానికి ప్రయత్నించడంలో తప్పేముంది అని కత్రినా వ్యాఖ్యానించడం కూడా ఆమె త్వరలో హాలీవుడ్ కి వెలుతుందనే వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.
ఇటీవల అగ్నిపథ్ సినిమాలో ‘చికినీ చమేలీ’గా అదరగొట్టిన కత్రినా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతోన్న ‘ఏక్ థా టైగర్’ చిత్రంలో నటిస్తోంది. దీనితో పాటు యష్ రాజ్ చోప్రా ప్రాజెక్టు, ధూమ్ 3, దోస్తానా 2 చిత్రాల్లోనూ అవకాశం దక్కించుకుంది.

Post a Comment