సూపర్ స్టార్ రజనీకాంత్ కి ప్రపంచమంతటా ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన తాజా చిత్రం 'కోచ్చడయాన్'ని ఇంగ్లీష్ లోనూ విడుదల చేస్తున్నారు. రజనీకాంత్ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది.
ఇక ఈ విషయమై సౌందర్య మాట్లాడుతూ..'ఇప్పటివరకు 'కోచ్చడయాన్'ను తెలుగు, తమిళం, హిందీలోనే తెరకెక్కించాలని అనుకున్నాం. ఇప్పుడు ఆంగ్లంలోనూ తీసుకొచ్చే ఆలోచన ఉంది. ఆ విషయాన్ని త్వరలోనే చెబుతాం. ఈనెల 15 నుంచి రజనీకాంత్, దీపికాతోపాటు యూనిట్ లండన్‌కు వెళ్లనుంది. అక్కడ 25 రోజుల పాటు చిత్రీకరణ ఉంటుంది. తరవాత విరామం తీసుకొని మరో 25 రోజులు చెన్నైలో తెరకెక్కిస్తాం. ఆగస్టు లేదా సెప్టెంబరులో చిత్రాన్ని విడుదల చేస్తామని అంది.
ఇక ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన దీపికా పదుకొణే నటిస్తోంది. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. శరత్‌కుమార్, స్నేహ, ఆది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నారు. ఈ మేరకు ఆయన కూతురు సౌందర్య తన ట్విట్టర్ లో ఓ ఫోటోని పెట్టి పోస్ట్ చేసింది.

Post a Comment