నాని సరసన నటించిన 'పిల్ల జమీందార్' హిట్టవడంతో తెలుగులో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని ఊహించిన కన్నడ సుందరి హరిప్రియకు ఆశాభంగమే ఎదురైంది. తమిళంలోనూ ఆమెది అదే పరిస్థితి. అక్కడ కూడా 'మురన్' సినిమా హిట్టయినా చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. మాతృభాష కన్నడమైనా తెలుగులో గలగలా మాట్లాడే హరిప్రియకు ప్రేమించి పెళ్లాడటమే ఇష్టమట.
ఎందుకంటే ఇద్దరి మధ్య అవగాహన ఉంటుంది. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుస్తుంది. అలాగని పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లకు నేను వ్యతిరేకం కాదు. ఏదైనా జీవితంలో సర్దుకుపోవడంతోనే ముడిపడి ఉంటుంది. అయితే నేనింతవరకు ప్రేమలో పడలేదు. కాలేజీ లైఫ్‌లో ప్రేమించమని చాలామంది కుర్రాళ్లు వెంటపడ్డారు.
ఎవరికీ ఓకే చెప్పలేదు. ఎందుకంటే నాది ప్రేమించే వయసు కాదు కాబట్టి. కెరీర్‌లో స్థిరపడిన తర్వాతే ప్రేమ, పెళ్లి గురించి ఆలోచిస్తా అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.ప్రస్తుతం ఆమె తన మాతృభాషలోనే నాలుగైదు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
Post a Comment