![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjCEUFMVc6_rDfZNeYAIytZP5S7Yv8wwSD3l4GuE7AsfTtJC8It7ADY6cW0YlXWnwJzbBMYmnzdpy5siQl10JdN0eeTXA8JjnK8jvK8wcK8OmPXf6cYxceK4eitC8TN7yOGu7L2x2cwkc_p/s1600/25-racha-movie-stills.jpg)
రామ్ చరణ్ రచ్చ రిలీజ్ కు ముందే వివాదంలో ఇరుక్కుంది. ఈ చిత్రంలోని పాటలో అసభ్యకరమైనవి ఉన్నాయని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఒక పాటలో గౌతమ బుద్దుని విగ్రహం ముందు అశ్లీల సన్నివేశాలు చిత్రీకరించారని జాతీయ అరుంధతీ మహిళా శక్తి అధ్యక్షురాలు పోలీసులకు పిర్యాదు చేసారు. ఈ చిత్రంలోని పాటని తొలిగించాలని ఆమె డిమాండ్ చేసారు. చిత్ర దర్శకుడు,నిర్మాత,కొరియోగ్రాఫర్స్ పై చర్చలు తీసుకోవాలని ఆమె కోరారు. హోం మినిస్టర్ కి, సెన్సార్ బోర్డ్ కు కూడా ఫిర్యాదు చేసినట్లు ఆమె మీడియాకు తెలిపారు. ఇక రేయ్ నువ్వు అరిస్తే అరుపులే...నేను అరిస్తే మెరుపులే..అంటూ వదిలిన రామ్ చరణ్ రచ్చ ట్రైలర్ అంతటా మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. అందులో కట్ చేసిన డైలాగులు ఫ్యాన్స్ నే కాక అందరినీ అలరిస్తోంది. ముఖ్యంగా చిరంజీవి టైప్ లో ఒక్కసారి లెప్ట్ టర్నింగ్ వేసుకో...కండ తక్కువ కటింగ్ ఎక్కువ అంటూ తమన్నా తో చెప్పే డైలాగు సూపర్బ్ అంటున్నారు. ఇక హిందీలో తమన్నా ని చూస్తూ..అప్ బాహర్ సే బహుత్ అచ్చా,హమ్ తేరే లియే ఇదర్ వచ్చా, చహమ్ దోనోంతో రచ్చ అంటూ చెప్పటం చాలా ఉత్సాహాన్ని ఇస్తోంది. ఇక రచ్చ చిత్రాన్ని సంపత్ నంది దర్శకత్వంలో రూపొందించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ..గ్యాంగ్ లీడర్ నాటి చిరంజీవిలా కనిపిస్తారని చెప్తున్నారు. అలాగే పరుచూరి వారు సైతం డైలాగులు అదిరిపోయేలా రాసామని హామీ ఇస్తున్నారు. ఆరెంజ్ వంటి మెగా డిజాస్టర్ తర్వాత వస్తున్న ఈ చిత్రం మాస్ హీరోగా మళ్లీ రామ్ చరణ్ తేజ్ని ఓ స్టెప్ ముందుకు తీసుకువెళ్తుందని భావిస్తున్నారు. ఇక మణిశర్మ అందించిన ట్యూన్స్ రిలీజ్ కు ముందే హైప్ క్రియేట్ చేసాయి.
Post a Comment