.
Home » » మొన్న పవన్ ఇప్పుడు అల్లు అర్జున్‌..

మొన్న పవన్ ఇప్పుడు అల్లు అర్జున్‌..

Written By Hot nd spicy on Thursday, 9 February 2012 | 07:36

మొన్న నితిన్ చిత్రం ఇష్క్ ఆడియో ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వెళ్ళి అలరించారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా మరో చిన్న చిత్రం ఆడియోకి గెస్ట్ గా వెళ్తున్నారు. ఆ చిత్రం టైటిల్'ఈ రోజుల్లో'. శ్రీ, రేష్మా జంటగా నటించిన ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించగా గుడ్‌ ఫ్రెండ్స్‌ సంస్థ నిర్మించింది. ఈ చిత్రంలోని గీతాల్ని ఈనెల 9న స్టార్ హీరో అల్లు అర్జున్‌ చేతుల మీదుగా విడుదల చేయనున్నమని వారు ప్రెస్ నోట్ విడుదల చేసారు.

ఇక తమ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ''ప్రేమంటే ఓ అనిర్వచనీయమైన అనుభూతి. ఎవరైనా ఒక్కసారే ప్రేమలో పడతారు. అయితే ఈ రోజుల్లో అలా లేదు. ప్రేమకున్న అర్థం మారిపోయింది. స్వచ్ఛమైన ప్రేమ దొరకడం లేదు. ఆ విషయమే మా సినిమాలో వినోదాత్మకంగా చూపిస్తున్నాం. సంగీతానికి ప్రాధాన్యం ఉంది. ఈ నెలాఖరున సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అన్నారు. ఇక అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి హీరోలు తమ సినిమాలకు మాత్రమే కాకుండా ఇలా చిన్న సినిమాలకు వచ్చి ప్రమోట్ చేయటం మంచి సంప్రదాయం అవుతుందని,అలా స్టార్స్ రావటం వల్ల ఆ సినిమాలకు మంచి ఎక్సపోజర్ దొరుకుతుందని చెప్తున్నారు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger