.
Home » » ఆ సినిమా రీమేక్ కై మహేష్ స్పెషల్ షో

ఆ సినిమా రీమేక్ కై మహేష్ స్పెషల్ షో

Written By Hot nd spicy on Thursday, 9 February 2012 | 07:39

మహేష్ బాబు ఇప్పటివరకూ ఏ రీమేక్ సినిమానూ చెయ్యలేదు. స్టార్ డైరక్టర్ శంకర్ వంటి వాళ్లు వచ్చి త్రీ ఇడియట్స్ లో చేయమన్నా రీమేక్ అనేసరికి నో చెప్పేసారు. అయితే తాజాగా ఆయన ఓ చిత్రాన్ని రీమేక్ కోసం స్పెషల్ షో వేయించుకుని చూడనున్నారని సమాచారం. కన్నడంలో విజయవంతమైన కో కో కోలి కోతి చిత్రాన్ని ఆయన త్వరలో చూడనున్నారని తెలుస్తోంది. కన్నడ దర్శకుడు ఆర్.చండ్రు ఈ చిత్రాన్ని అక్కడ డైరక్ట్ చేస్తున్నారు.

తెలుగులోనూ ఆయనే డైరక్ట్ చేస్తారని చెప్తున్నారు. ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం ఇతర రాష్ట్రాల నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నట్లు చెప్తున్నారు. అలాగే తమిళంలో ఈ చిత్రాన్ని ఆర్యతో రీమేక్ చేస్తున్నారు. అక్కడ కూడా చండ్రునే డైరక్ట్ చేయనున్నారు. మరి నిర్మాతల కోరిక మేరకు ఈ సినిమాను మహేష్ చూస్తున్నారా లేక నిజంగానే ఆయన రీమేక్ కమిటవుతారా అనేది త్వరలో తేలనుంది. ఈ చిత్రం కర్ణాటకలో పొంగల్ కానుకగా విడుదలైంది.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger