మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తర్వలో బాలీవుడ్‌లో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన హిట్ మూవీ ‘జంజీర్’ రీమేక్‌లో చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయాన్ని చరణ్ కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం రామ్ చరణ్ తేజ్ ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ హీరోయిన్ దీపిక పడుకొనెతో రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో పెప్సి యాడ్‌లో దీపిక-రామ్ చరణ్ కలిసి నటించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి పరిచయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి నటించేందుకు అంగీకరించారని తెలుస్తోంది.
ప్రస్తుతం రామ్ చరణ్ సంతప్ నంది దర్శకత్వంలో రచ్చ సినిమా చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఇంకా అజ్మల్ అమీర్, ప్రకాష్ రాజ్, ముఖేష్ రుషి, బ్రహ్మానందం ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా...లీసా హెడెన్ ఐటం సాంగులో మెరవనుంది.
దీని తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘ఎవడు’ చిత్రంలో నటించనున్నాడు. ఇందులో చెర్రీ సరసన సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా ఎంపికయ్యారు. దీని తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. మెగా ప్రొడ్యూసర్ అశ్వినీదత్ వై.జయంతి మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగాల్సి ఉంది.

Post a Comment