మాస్ మహారాజ రవితేజ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా యమలోకం సెట్ వేస్తున్నారు. రవితేజ నటిస్తున్న ‘దరువు’ చిత్రం కోసం దీన్ని డిజైన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో తమిళ నటుడు ప్రభు యమ ధర్మరాజుగా కనిపించనున్నాడు. శౌర్యం ఫేం శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సౌండ్ ఆఫ్ మాస్ అనే సబ్ టైటిల్ తో ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న చిత్రంలో తాప్సీ కథానాయిక. ప్రస్తుతం నిరవధికంగా షూటింగ్ జరుగుతోంది.
ఈ చిత్రంలో రవితేజ గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్తగా కనిపించబోతున్నాడు. పూర్తి మాస్ ఎంటర్‌టైనర్ గా రూపొందబోతున్న ఈ చిత్రంలో రవితేజ ఐదు షేడ్స్ విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడు. గతంలో విక్రమ హీరోగా వచ్చిన అపరిచితుడు సినిమాలో హీరో మూడు విభిన్నమైన పార్శ్వాల్లో కనిపిస్తాడు. అదే తరహాలో రవితేజ ఇందులో ఐదు పార్శ్వాల్లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు అల్లరి చిల్లర రౌడీ క్యారెక్టర్లతో కామెడీ హీరోగా కనిపించిన రవితేజ ఈ సినిమాలో తనలోని అసలైన నటుడిని ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది.

Post a Comment