.
Home » » ఆ సినిమా నటించే యువ హీరో ఎవరు?!

ఆ సినిమా నటించే యువ హీరో ఎవరు?!

Written By Hot nd spicy on Monday, 6 February 2012 | 19:17

మగధీర, జల్సా, బద్రినాథ్‌ నిర్మాత అల్లు అరవింద్‌తో కలిసి బృందావనం, మిస్టర్‌ఫర్‌ఫెక్ట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కలిసి ఓ మెగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి 'యజ్ఞం' ఫేమ్‌ ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం '100%లవ్‌' నిర్మాత బన్నివాసు వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్ర కథను విని దిల్‌రాజు ఎలా ఎక్సైట్‌ అయ్యారు. ఆ విషయం బన్నివాసు అరవింద్‌కు చెప్పడంతో.. అంతా కలిసి నిర్మాణం సిద్ధం చేశారు.

ముందుగా ఇందులో హీరోగా అల్లు అర్జున్‌ను అనుకున్నారు. డేట్స్‌ ప్రాబ్లమ్‌వల్ల కుదరలేదు. మరి ఈ చిత్రంలో నటించబోయే యువ హీరో ఎవరు? అనేది సస్పెన్స్‌గా ఉంచారు. త్వరలో ఆ విషయాన్ని తెలియజేస్తామని నిర్మాతలు చెప్పారు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger