.
Home » » బాలకృష్ణ సీఎం అయ్యాక "నర్తనశాల" చేస్తారట

బాలకృష్ణ సీఎం అయ్యాక "నర్తనశాల" చేస్తారట

Written By Hot nd spicy on Monday, 6 February 2012 | 19:15

నందమూరి బాలకృష్ణ, పార్వతీ మెల్టన్‌, ఇషా చావ్లా నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్‌ అన్నపూర్ణ స్టూడియోలో సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ఆర్‌ఆర్‌ మూవీమేకర్స్‌ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్‌ నిర్మిస్తున్న చిత్రమిది. రమేష్‌ పుప్పాల నిర్మాత. రవికుమార్‌ చావలి దర్శకుడు. ఈ చిత్రం ముహూర్తపు షాట్‌ను ఇద్దరు భామలతో బాలయ్య కూడిన సన్నివేశాన్ని చిత్రించారు. డా|| దాసరి నారాయణరావు క్లాప్‌ కొట్టగా, కృష్ణంరాజు కెమేరా స్విచ్చాన్‌ చేశారు.

బాలకృష్ణ మాట్లాడుతూ, ఇది నేను గర్వించే చిత్రంగా ఉంటుంది. కథలో కొత్తదనం ఉంది. సందేశం కూడా దర్శకుడు బాగా చూపించబోతున్నాడు. నా నుంచి అభిమానులు ఏమి ఆశిస్తారో అంతా ఈ చిత్రంలో ఉంటుంది అన్నారు. ఎటువంటి కథాంశమని.. అడిగితే.. అప్పుడే ఎందుకంటూ.... రాజకీయ చిత్రమా? అని అడిగితే.... నవ్వే సమాధానంగా చెప్పారు. కనుక బాలకృష్ణ రాజకీయ అరగేంట్రంకు ఈ చిత్రం పనికివస్తున్నదన్నమాట.

దర్శకుడు మాట్లాడుతూ... బాలయ్య బాబు రియల్‌ క్వాలిటీస్‌ ఈ చిత్రంలో ఉపయోగించుకుంటున్నాం. కథాపరంగా అవి చాలా ఉపయోగపడతాయి. నిర్మాత మాట్లాడుతూ, ఈ నెల 13 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుందనీ, ఏకధాటిగా జరిగే షెడ్యూల్తో పూర్తి చేస్తామని చెప్పారు.

సి.ఎం.అయ్యాక..నర్తనశాల!
ఈ సందర్భంగా బాలయ్య అభిమానులు అన్నపూర్ణ స్టూడియోలో సందడి చేశారు. జై బాలయ్య.. అంటూ నినాదాలు చేశారు. 'నర్తనశాల' ఎప్పుడూ అంటే... కొంతమంది... సి.ఎం. అయ్యాక.. అంటూ... పెద్దపెట్టున అరిచారు. దీంతో... బాలయ్య ముసిముసి నవ్వులు చిలికించారు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger