పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమా ‘గబ్బర్ సింగ్’ టీజర్ నిన్న(ఫిబ్రవరి 23) విడుదలైన సంగతి తెలిసిందే. తొలిరోజే ఈ టీజర్ కు టెర్రిఫిక్ రెస్పాన్ష వచ్చింది. ‘నాకు కొంచెం తిక్కుంది..కానీ దానికి ఓ లెక్క ఉంది’ అంటూ పవన్ చెబుతున్న డైలాగ్ అదిరిపోయింది అంటున్నారు అభిమానులు. ‘గబ్బర్ సింగ్’ టీజర్ యూ ట్యూబ్ లోనూ సంచలనాలు నమోదు చేస్తోంది. వపన్ కళ్యాణ్ గత సినిమా ‘పంజా’ తొలి రోజే 2 లక్షల మైలురాయిని దాటితే గబ్బర్ సింగ్ టీజర్ తొలి 20 గంటల్లోనే 4 లక్షల మైలురాయిని క్రాస్ చేసింది. గబ్బర్ సింగ్ టీజరే ఇలా రికార్డులు నమోదు చేస్తుంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈచిత్రంలో పవన్ కొండవీడు పోలీస్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో ఇంకా సుహాసిని, కోట శ్రీనివాసరావు, అజయ్, అభిమన్యు సింగ్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అలీ, మాస్టర్ ఆకాష్, మాస్టర్ సాయినాగన్, నాగినీడు, సత్యంరాజేష్, రావు రమేష్, ఎం.ఎస్. చౌదరి, ఫిష్ వెంకట్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: కడలి బ్రహ్మ, ఎడిటింగ్ గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగ్నేష్ సతీష్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

Post a Comment