మహేష్ బాబు తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ చిత్రం రోజూ ఏదో ఒక విధంగా వార్తలకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం పోస్టర్ పై ఓయూ జాయింట్ యాక్షన్ కమిటీ ఓ కంప్లైంట్ ని నిన్న ఆదివారం నమోదు చేసింది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ‘A’సర్టిఫికేట్ ఇచ్చింది కానీ వారు దాన్ని పోస్టర్స్ వేయటం లేదని ఆరోపించింది. ఈ విషయమై కంప్లైంట్ చేసిన వారిలో ఒకరైన కర్నాటి రాజు మాట్లాడుతూ...జూలై 27,2007లో డిజిపీ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఏ నిర్మాత అయినా సెన్సార్ సర్టిఫికేట్ ని పోస్టర్స్ పై చూపకపోతే వారిని నాన్ బెయిల్ బుల్ కేసులో బుక్ చేయాలనే ఆర్డర్ ఉందని గుర్తు చేసారు.
అయితే కంప్లైంట్ పై ఓయూ పోలీసులు..లీగల్ ఒపీనియన్ తీసుకుని ఈ కేసుని రిజిస్టర్ చేసి విచారిస్తామన్నారు. ఇక బిజినెస్ మ్యాన్ చిత్రం పూరీ జగన్నాధ్ డైరక్ట్ చేయగా సంక్రాంతి కానుకగా విడుదల అయ్యింది. మహేష్ బాబు,కాజల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని రికార్డులను బ్రేక్ చేసే కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

Post a Comment