ప్రముఖ దర్శకుడు రాజమౌళి తాజాగా నిత్యామీనన్ బరువుపై చేసిన ట్వీట్ హాట్ గా మారింది. నితిన్ తో నిత్యా చేసిన ఇష్క్ చిత్రం చూసిన ఆయన ట్విట్టర్ లో నిత్యా బరువు గురించి ప్రస్దావించారు. ఆ ట్వీట్ లో ...ఆమె నటన చాలా న్యాచురల్ గా ఉంది. ఆమె తన బరువు ని కాస్త పట్టించుకుంటే బావుంటుందని ఆశిస్తున్నాను అన్నారు. ఇది ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంసమైంది. నితిన్, సునీల్ అంటే గతంలో రాజమౌళి తో సినిమాలు చేసిన హారోలు. కాబట్టి వారిపై ట్వీట్ చేసారు.
అలాంటిది నిత్యామీనన్ ని పొగడటం, బరువు తగ్గితే బావుంటుంది అనటంతో ఆమెకు తదుపరి సినిమాల్లో ఏమన్నా వేషం ఆఫర్ చేసే అవకాసం ఉందని అంటున్నారు. ఇక రాజమౌళి ప్రస్తుతం ఈగ ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. సమంత,నాని కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రమోషన్ రీసెంట్ గా చెన్నైలో మొదలెట్టారు. ఇక ఈగ తర్వాత ప్రభాస్ కాంబినేషన్ లో ఆయన సినిమా చేయనున్నారు. ఆ సినిమా కోసం ప్రభాస్ సైతం తన బాడీని సిక్స్ ప్యాక్ లా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని వినికిడి.

Post a Comment