రవితేజ-దీక్షసేథ్ జంటగా గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నిప్పు’. వైవిఎస్ చౌదరి బొమ్మరిల్లు వారి సినిమా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సింగీతం అందించిన ఈ చిత్రాన్ని మహా శివరాత్రిని పురస్కరించుకుని ఫిబ్రవరి 17న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మలయాళీ హాటీ, ఒంటరి, మహాత్మా సినిమాల ఫేం హీరోయిన్ భావన గెస్ట్ రోల్‌లో కనిపించనుందని, ఒకరికి ఒకరు సినిమా ఫేం హీరో శ్రీరామ్ భావనకు జోడీగా కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే దర్శక నిర్మాతలు మాత్రం వారి క్యారెక్టర్లు ఏమిటి? అనే విషయాన్ని వెల్లడించలేదు.
రవితేజ ఈ సినిమాలో సూర్య పాత్రలో నటిస్తున్నాడు. ఎలాంటి బాధ్యతలు లేని, ఎలాంటి లక్ష్యాలేని జులాయిలా ఉంటాడు. అయితే ఉన్నట్టుండి అతనిపై పెద్ద బాధ్యత వచ్చి పడుతుంది. ఈ క్రమంలో సినిమా ఆసక్తికరంగా సాగుతుందని అంటున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సర్వేష్ మురారి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: తమన్, నిర్మాత: వైవిఎస్ చౌదరి, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం : గుణశేఖర్
ఈ చిత్రం తర్వాత రవితేజ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రంలో నటించబోతున్నాడు. గతంలో రవితేజ పూరి కాంబినేషన్లో ఇడియట్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి.

Post a Comment