''పవన్‌కల్యాణ్ అంటే నాకు అమ్మానాన్నలతో సమానం. పవన్ లేకపోతే నాకు ఈ జీవితమే లేదు. ఒకే ఒక్క రాత్రిలో నా జీవితాన్నే మార్చారాయన'' అని ప్రముఖ దర్శకుడు కరుణాకరన్ మాట్లాడుతూ అన్నారు. నితిన్ కొత్తి చిత్రం ఇష్క్ ఆడియోకు విచ్చేసిన ఆయన అలా స్పందించారు. గతంలో పవన్ కళ్యాణ్,కరుణాకరన్ కాంబినేషన్ లో తొలిప్రేమ,బాలు చిత్రాలు వచ్చాయి. ఇక అదే పంక్షన్ లో నితిన్ సైతం కరుణాకరణ్ గురించి చెపుతూ... ఒక రోజు కరుణాకరన్ అనుకోకుండా మా ఇంటికొచ్చారు. అప్పుడు 'నువ్వు అందంగా ఉంటావ్. నీ మొదటి సినిమాకి నేనే దర్శకత్వం వహిస్తా' అని చెప్పి వెళ్లిపోయారు. అప్పట్నుంచి సినిమా చెయ్యాలని మనసులో నాటుకుపోయింది అన్నారు. ఇక ప్రస్తుతం కరుణాకరన్ ..రామ్ హీరోగా ఎందుకంటే ప్రేమంట చిత్రం చేస్తున్నారు. సమంత, రామ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ అని తెలుస్తోంది. స్రవంతి రవికిషోర్ ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Home »
» ఒక్క రాత్రిలో పవన్ నా జీవితాన్నే మార్చారు
Post a Comment