‘ఆవకాయ్ బిర్యాని’ చిత్రంలో నటించిన బిందుమాధవి గుర్తుంది కదా.! ఆ చిత్రం తర్వాత హీరోయిన్‌గా రెండుమూడు అవకాశాలు వచ్చినా ఆ చిత్రాలు విజయవంతం కాకపోవడంతో తెలుగులో ఆమెను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయితో చేసిన చిత్రం హిట్ రేంజ్‌కి వెళ్ళినా అమ్మడికి మాత్రం అవకాశాలు ఆమడదూరంలో నిలబడ్డాయి. సరదాగా చేసిన తమిళ సినిమాలు అనుకోకుండా క్లిక్ అవడంతో చెన్నయ్‌లో బిందుమాధవికి అవకాశాలు తలుపులు తట్టాయి. దీంతో తన మకాం అక్కడికే మార్చేసింది. తెలుగులో తనను చిన్నచూపుచూస్తున్నారనీ, రచ్చగెలిచి ఇంటికి వద్దామన్న ఆశతో ఎదురుచూస్తోంది. దానికి తగ్గట్టు తమిళంలో అవకాశాలు సాంబార్‌లో ఆవకాయ్ నంజుకున్నట్లుగా వచ్చిపడుతున్నాయి. తమిళ నేటివిటీకి సరిపోయిన వయ్యారాలు ఆమెలో కనబడేసరికి, బిందుమాధవికి కాల్‌షీట్ల ఇబ్బంది కూడా ఎదురవుతోందట. మొత్తానికి తెలుగు అమ్మాయిని తెలుగువాళ్లు పట్టించుకోకపోయినా పక్కనున్న తమిళ తంబిలు అక్కున చేర్చుకోవడం ఆనందించదగ్గ విషయమేకదా!
Home »
» తమిళ్లో తడాఖా చూపిస్తున్న బిందు మాధవి
Post a Comment