గోపీచంద్ హీరోగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ థమన్ సంగీత సారథ్యంలో నిర్మాత తాండ్ర రమేష్ ఈ నెలాఖరులో ఓ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. బాలాజీ రియల్ మీడియా బ్యానర్‌లో నిర్మితమయ్యే ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం భూపతి వహిస్తున్నారు. ఇంకా హీరోయిన్ ఖరారుకాని ఈ చిత్రానికి మాటలు ఎం.రత్నం, కెమెరా: శక్తి శ్రావణ్. ఈ చిత్ర నిర్మాత తాండ్ర రమేష్ తెలుగులో హిట్టయిన ‘ఏమైంది ఈ వేళ’ చిత్రాన్ని తమిళంలో నిర్మిస్తున్నారు. గత సంవత్సరం గోపీచంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘మొగుడు’ ‘వాంటెడ్’ చిత్రాలు ఆశించిన రీతిలో విజయవంతం కాలేదు. ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టాలనే కసితో ఉన్న గోపీచంద్ మంచి కథాబలం, కమర్షియల్ హంగులు ఉన్న చిత్రాన్ని ఎంపికచేసుకుంటున్నట్లు సమాచారం.
Home »
» గోపిచంద్ సినిమాకు థమన్ సంగీతం
Post a Comment