Home »
» జోరుగా జెనీలియా పెళ్లి ఏర్పాట్లు!
జోరుగా జెనీలియా పెళ్లి ఏర్పాట్లు!

హీరోయిన్ జెనీలియా పెళ్లి మూహూర్థం దాదాపుగా ఖరారైంది. తన సహచర నటుడు రితేష్ దేశ్ ముఖ్ తో గత ఐదారేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న జెనీలియా ప్రేమ వ్యవహారం గతేడాది బట్టబయలైంది. ఆమె ప్రియుడే ఈ విషయాన్ని లీక్ చేశాడు. కొంత కాలంగా పాటు ఏమీ ఎరుగనట్లు మౌనంగా ఉన్న జెన్నీ కూడా ఎట్టకేలకు ఈ విషయాన్ని ఒప్పకుంది. పెద్దలు సైతం అంగీకారం తెలపడంతో ఫిబ్రవరిలో ముహూర్తం ఖరారైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫిబ్రవరి 3న వీరి పెళ్లి జరుగనుందని తెలుస్తోంది. రితేష్ కుటుంబ సభ్యులు దాదాపు నాలుగురోజుల పాటు అంగరంగ వైభవంగా వివాహ వేడుకల్ని జరపడానికి సన్నాహాలు చేస్తున్నారట.
ముందు ఈ నెల 31న ముంబైలోని గ్రాండ్స్ ల్యాండ్ హోటల్‌లో సంగీత్ కార్య్రక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారని, ఆ తర్వాత ఫిబ్రవరి 3న హోటల్ గ్రాండ్ హయత్‌లో వివాహం జరుగుతుంది. ఇరుకుటుంబాలకు సంబంధించిన అత్యంత సన్నిహితులు, బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
ఈ సంవత్సరం జెనీలియా తెలుగుతో హీరో రాణా దగ్గుబాటితో ‘నాఇష్టం’ అనే సినిమాలో నటిస్తోంది. అదే విధంగా హిందీలో ఇట్స్ మై లైఫ్, తేరే నాల్ లవ్ హోగయా, రాక్ ద శాది, బ్లడీ పాకి అనే చిత్రాల్లో నటించనుంది. పెళ్లి తర్వాత కూడా జెనీలియా హీరోయిన్‌గా తన కెరీర్ కంటిన్యూ చేయనుంది.
Post a Comment