ఇంటర్నెట్ సెర్చింగ్ దిగ్గజం గూగుల్ ప్రవేశపెట్టనున్న ‘గూగుల్ టివి’ పైనే ఇప్పుడు అందరి కళ్లు ఆసక్తిగా చూస్తున్నాయి. ఎప్పటినుండో ఊరిస్తూ వస్తున్న ఈ గూగుల్ టీవీతో 2012లో తన సత్తాను మరోసారి చాటుకోవాలని ఇది తహతహలాడుతోంది. గూగుల్ టివిలో గూగుల్ టివి అప్లికేషన్లను జోడిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ టీవీ పేరుతో హల్ చల్ చేస్తున్న ప్రముఖ సంస్థలు శామ్‌సంగ్, సోనీ టీవీలకు ఇది గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు.
గూగుల్ కొత్తగా రూపొందించిన ఈ గూగుల్ టివి టెక్నాలజీ మార్కెట్లో పెద్ద సక్సెస్‌ని సాధిస్తుందని కూడా ఆ సంస్థ ప్రతినిధులంటున్నారు. గతంలో మార్కెట్లో విడుదలయిన టీవీలకు కూడా ఈ గూగుల్ టీవి నుండి పెద్ద పోటీనే ఎదురయ్యే అవకాశాలున్నాయంటున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో గూగుల్ టీవిని ఎక్కువగా ఉపయోగిస్తున్న దేశాల్లో లండన్, అమెరికాలు ముందున్నాయి.
భవిష్యత్తులో మన దేశం, చైనాల్లో స్మార్ట్ టీవీ వినియోగదారుల సంఖ్య కూడా పెరుగనుందని ఒక అంచనా! దీనిని దృష్టిలో పెట్టుకుని గూగుల్ టివి టెక్నాలజీని ప్రపంచ వ్యాప్తంగా మిగతా దేశాలకు విస్తరించాలనే ఆలోచనలో ఉన్నారు. గూగుల్ టివి రాకతో స్మార్ట్ టివి రంగంలో సంచలనాత్మక మార్పులు చోటుకోగలవని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సోనీ ఇప్పుటికే స్మార్ట్ టీవీ రంగంలో వెనుకబడడం వల్ల మేము ఈ సమయంలో మార్కెట్లోకి ప్రవేశిస్తే ఎక్కువ అమ్మకాలు తమకే సాధ్యమవుతుందని గూగుల్ ప్రతినిధులంటున్నారు.
గూగుల్ విడుదల చేయనున్న ఈ స్మార్ట్ టీవీలను ఆఫీసులు, ఇంటర్నెట్ సెంటర్లు, గృహాల్లో ఉపయోగించుకోవచ్చు. మరోవైపు ఆపిల్ కూడా ఈ ఏడాది తన స్మార్ట్ టీవీని విడుదల చేసే పనిలో బిజీగా ఉంది. అయితే ఆపిల్ తమకు ఏమాత్రం పోటీయే కాదని గూగుల్ ప్రతినిధులు ఘంటాపధంగా చెపుతున్నారు. గూగుల్ స్మార్ట్ టీవీని ఆస్వాదించడానికి సిద్ధం కండి.

Post a Comment