సూపర్‌స్టార్ మహేష్, కాజల్, ప్రకాష్‌రాజ్, షాయాజి షిండే, నాజర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, భరత్‌రెడ్డి, రాజా మురాద్, జహంగీర్ ఖాన్, మహేష్ బాల్‌రాజ్, ఆయేషా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్ ఎస్., సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఫైట్స్: విజయ్, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, డాన్స్: దినేష్, కో-డైరెక్టర్: విజయరామ్‌ప్రసాద్, కో-ప్రొడ్యూసర్: వి.సురేష్‌రెడ్డి నిర్మాత: డా|| వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్
పాయింట్: ముంబైలో ఉన్న ఓ రౌడీ తననుకున్న గోల్‌తో ఢిల్లీలో ప్రధానమంత్రిని కూడా ఎలా శాసించాడు అన్నది.
మహేష్‌బాబు, పూరీజగన్నాథ్ కాంబినేషన్ అంటే పోకిరి అంత రేంజ్‌లో ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. అందుకే ఐదేళ్ళ గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మళ్ళీ ఆ ట్రెండ్‌లోనే వచ్చిన సినిమా 'బిజినెస్‌మేన్'. మహేష్‌కు 'దూకుడు' తర్వాత అంతటి సక్సెస్ ఇవ్వాలనీ, తనకూ అంత సక్సెస్ కావాలని పూరీ ఏరికోరి కల్పిత కథను అల్లుకుని దాన్ని లాజిక్కుగా చెప్పాలని ప్రయత్నించాడు. టైటిల్స్‌కు ముందే ఈ సినిమా ముంబైలో జరుగుతుంది... కనుక కథకు కన్‌వీనియంట్ కోసం పాత్రలన్నీ తెలుగులోనే మాట్లాడతాయని దర్శకుడు చెప్పేశాడు. ప్రిన్స్ కాస్త సూపర్‌స్టార్ మహేష్ అనే స్లైడ్ కూడా వేశారు.
ముంబై పోలీస్ కమీషనర్ అజయ్ భరద్వాజ (నాజర్) చివరిగా ఓ వజీర్ అనే మాఫియా వాడిని పట్టుకుంటాడు. దీంతో మాఫియా భాయ్ అనేవాడ్ని లేకుండా చేసేస్తాడు. అదే టైమ్‌లో విజయసూర్య (మహేష్‌బాబు) తన స్నేహితుడు బ్రహ్మాజీ ఇచ్చిన ఛార్జీలతో ఊరినుంచి ముంబైకు వస్తాడు. తన స్నేహితునికి 12వేల జీతం వచ్చే ఉద్యోగాన్ని మానేసి తనకింద పనిచేస్తే 25వేలు ఇస్తానంటాడు. అసలు తాను వచ్చింది ముంబైను ఉచ్చపోయించడానికేనంటాడు. అతనిలోని ఆవేశం, కోపం, కసి చూసి ఆశ్చర్యపోయిన బ్రహ్మాజీ చేసేది లేక సూర్య చెప్పింది చేస్తుంటాడు.
జరిగిన సంఘటనల్ని తనకు అనుకూలంగా మార్చుకుని డబ్బులు సంపాదించేస్తుంటాడు సూర్య. అలా ముంబైలో భాయ్‌గా చలామణి అయ్యేట్లు ప్లాన్ చేసుకుంటాడు. మరోవైపు చిత్ర(కాజల్ అగర్వాల్)ది మరోలోకం. తనో చిత్రకారిణి. రంగులు, బొమ్మలు వేస్తూ కాలక్షేపం చేస్తుంది. అటువంటి ఆమెను అసహ్యించుకుంటూనే ప్రేమలోకి దించేస్తాడు.
ముంబైలోని భాయ్ అనేవాడు లేడనుకుంటున్న పోలీస్‌కమీషనర్‌కు సూర్యాభాయ్ ఉన్నాడని తెలిసి.. అతనిపై నిఘా పెడతాడు. అప్పటికే ముంబైలోని మాఫియాను తన గుప్పెట్లో ఉంచుకుంటాడు. రాజకీయనాయకులు అతనికి అండగా ఉంటారు. మాఫియా అండతో ఎదిగిన నాయకుడు లాలూ(షిండే)ను మేయర్ చేస్తానని సూర్య మాటిస్తాడు. కానీ ప్రస్తుత మేయర్‌కు ఢిల్లీలో మంత్రి జయదేవ్(ప్రకాష్‌రాజ్) సపోర్ట్ ఉంటుంది.
రాబోయే ఎలక్షన్లో ప్రధానమంత్రి కావాలనుకునే జయదేవ్‌కు ముంబై మేయర్ ఎన్నిక కీలకం. దాంతో అడ్డుగా ఉన్న సూర్యనే వేసేయమని ఢిల్లీనుంచి గ్యాంగ్‌ను పంపిస్తాడు. సూర్య పసిగట్టి వారినే వేసేస్తాడు. చేసేదిలేక జయదేవ్ ముంబై వస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అసలు జయదేవ్‌కు, సూర్యకు లింకేమిటి? సూర్య ప్రేమ వ్యవహారం ఏమయింది? అసలు బిజిసెస్‌మేన్ అంటే అర్థం ఏమిటి? అనేది సినిమా.
కథ మొత్తం మహేష్‌బాబు మీదనే నడుస్తుంది. సీరియస్‌గా ఉంటూనే కామెడీ చేయించాడు దర్శకుడు పూరీజగన్నాథ్. సినిమా స్క్రీన్‌ప్లే అంతా సిల్లీగా అనిపిస్తుంది. కానీ మహేష్‌బాబు చేసే సన్నివేశాలు, పలికించే షేడ్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. కొత్తగా ఆలోచించడంలో పూరీ జగన్నాథ్ ఇందులో కన్పిస్తాడు. ప్రత్యేకంగా డైలాగ్ డెలివరలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడు. సింపుల్ డైలాగ్‌లు, సింపుల్ ఏక్టింగ్. కథ కూడా సిల్లీగా అనిపిస్తుంది. నేరస్థుల్ని కంట్రోల్ చేయాలంటే.. వారికి నెలకు ఇంత అని ఏర్పాటు చేస్తూ... తాను పెట్టిన సూర్య ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ బిజిసెన్‌ను ఎలా డెవలప్ చేశాడు? అన్నది ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాడనేది క్లైమాక్స్‌లో చెప్పే ఫ్లాష్‌బ్యాక్‌లో లాజిక్కు ఉంది. అందుకే కథను ఆ ప్రకారం తీసుకున్నాడు దర్శకుడు. మిగిలిన పాత్రలన్నీ పాత్రకు సరిపోయాయి. ఇటీవల కొన్ని సినిమాల్లో వచ్చినట్లే ప్రకాష్‌రాజ్ క్లైమాక్స్‌కు ముందు కన్పిస్తాడు. నాజర్, ధర్మవరపు, షిండే, సంజయ్ స్వరూరప్, రాజా ముర్రాద్ తదితరులు బాగానే చేశారు.
పాటలన్నీ భాస్కరభట్ల రవికుమార్ రాశాడు. మొదటి భాగంలో చాలాసేపు కథ నెరేషన్ సరిపోతుంది. ఆ తర్వాత వచ్చే పాటలు కూడా బాగానే ఉన్నాయి... 'సారొస్తారొ రత్తారత్తారే..' పాటలోని డాన్స్ కూడా క్యాచీగా ఉంది. 'పిల్లాచావ్. చావ్.. అనేపాట ఓ విదేశీ పాటకు కాపీ. అది తనే ఒప్పుకున్నాడు పూరీ... 'వియ్ లవ్ బ్యాడ్ బాయ్స్..' ఇలా మిగిలిన పాటలు కూడా బాగానేఉన్నాయి. థమన్ బాణీలు ఆకట్టుకున్నాయి. శ్యామ్ కె నాయుడు కెమెరా పనితం ఫర్వాలేదు. యాక్షన్ సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి. కొన్ని షేడ్స్ పోకిరిని గుర్తుచేస్తాయి. ఇదేకాకుండా టోటల్‌గా స్క్రీన్‌ప్లే కూడా పోకిరిని టచ్ చేస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ కథ ప్రకారమే ఉన్నాయి.
స్క్రిప్ట్‌లో ఉన్నట్లు రియల్‌గా జరిగే సన్నివేశాలే కన్పించవు. అంతా సినిమాటిక్‌గా కన్పిస్తాడు. హీరోపైనే కథంతా తిరగడం... ఆ పాత్ర చుట్టూ మిగిలిన పాత్రలు ట్రావల్ కావడం... హీరోయిన్‌ను కొత్తగా లవ్ చేసే విధానం.. వంటివి స్క్రిస్ట్‌లో తనకొచ్చిన తెలివితేటలతో రాసేశాడు. కొన్ని సన్నివేశాలు టూమచ్‌గా అన్పిస్తాయి.. ప్రేక్షకుడు అనుకుంటాడు.. అందుకే... ఓ సన్నివేశంలో.. వీడికి బ్రైన్ ఎక్కువైంది. కట్ చేస్తే పోద్ది.. అని కాజల్ చేత అనిపిస్తాడు దర్శకుడు.
అంత ఓవర్ బ్రెయిన్‌తో తీసిన సినిమా ఇది. క్లెమాక్స్‌లో చెప్పే డైలాగ్‌ల్లో పవర్ ఉంది. ప్రతి మనిషి గోల్‌తో పనిచేయాలి. ఏదైనా సరే.. చదువైనా గోల్ పెట్టుకోండి.. నీకంటే తోపు ఎవ్వడూలేడు.. అంటూ యూత్‌ను రెచ్చగొట్టే డైలాగ్‌తో సూర్య ముంబైతో పాటు ఢిల్లీని కూడా ఉచ్చపోయిస్తానని చెప్పిస్తాడు దర్శకుడు. ఆ డైలాగ్‌లోంచే కథ రాసుకున్నాడు దర్శకుడు. ఫ్యాన్స్‌కు ఏమి కావాలో... పల్స్ తెలిసినవాడు కనుక వారిని బాగా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.

Post a Comment