బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రీనా కైఫ్‌కు దక్షిణాది టాప్ హీరోల సరసన నటింపజేయాలని దర్శకులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం "కొచ్చడైయాన్"లో కత్రినా కైఫ్ కాల్షీట్ కోసం దర్శకుడు ఎస్.వి. రవికుమార్ సంప్రదింపులు జరిపిన మాట నిజమేనని, కానీ ఇంకా కత్రినా కైఫ్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయడం ఖరారు కాలేదని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో దశావతారం హీరో కమల్ హాసన్ తాజా చిత్రం "తలైవన్ ఇరుక్కిరాన్"లో కత్రినా కైఫ్ నటించబోతోందని సమాచారం. ఈ చిత్రంలో కమల్‌తో ఈ బాలీవుడ్ హాటీ రొమాన్స్ చేయనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్.
ఇంకా "గ్యాంబ్లింగ్" హీరో అజిత్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాణ సారథ్యం వహిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా కత్రినాను ఎంపిక చేసేందుకు రంగం సిద్ధమవుతోందట..!

Post a Comment