రజనీకాంత్ అలియాస్ రజనీ. తమిళనాడు రాష్ట్రంలోనే కాదు దక్షిణభారతంలో ఈ పేరు తెలియని వారుంటూ ఉండరు. వెండితెర మీద రజనీకాంత్ చేసే సినీ సాహసాలు ప్రతి ఒక్కరికీ ఎరుకే. కానీ.. నిజ జీవితంలోనూ ఆయన సాహసాలు చేస్తారని రుజువు చేశారు.. ఆయన అభిమానులు. ఒక వెబ్‌సైట్ పని చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. కానీ.. ఆల్‌అబౌట్‌రజనీ డాట్ హెచ్‌టీఎం పేరుమీద ఏర్పాటు చేసిన వెబ్‌సైట్ ఇంటర్నెట్ కనెక్షన్ తొలగిస్తేనే పని చేస్తుంది. ఇది విచిత్రంగా ఉంది కదూ.
నిజమేనండీ బాబూ.... రజనీకాంత్ సైట్‌లోకి ప్రవేశించగానే "ఆయన సాధారణ వ్యక్తికాదు. ఇది సాధారణ వెబ్‌సైట్ కాదు. ఇది రజనీ శక్తితో నడుస్తున్న సైట్. ఈ సైట్‌లోకి వెళ్లాలంటే మీరు నెట్ కనెక్షన్ తొలగించాలి అన్న స్వాగత వచనాలు కంప్యూటర్ మానిటర్‌పై కనిపిస్తాయి. లోనికి వెళితే రజనీకాంత్‌కు సంబంధించిన అన్ని అంశాలు అందులో ఉంటాయి.
ఈ వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసిన గురుభక్ష్ సింగ్ మాట్లాడుతూ... అత్యంత సంక్లిష్టమైన ఆల్గారిథమ్స్‌ను ఉపయోగించి సైట్‌ను తయారు చేసినట్టు చెప్పారు. ఈ టెక్నిక్స్ ఉపయోగించడం వల్ల ఇంటర్నెట్ వేగం సున్నాకు చేరుకున్న తర్వాతే ఈ సైట్ పని చేయడం ప్రారంభిస్తుందన్నారు. తమ అభిమాన హీరోకు తాము అందించే అపురూమైన కానుక ఇదేనన్నారు.

Post a Comment