Home »
» బిజినెస్ మేన్’ లో లిప్ లాక్ సీన్‌పై నమ్రత ఓకే!
బిజినెస్ మేన్’ లో లిప్ లాక్ సీన్‌పై నమ్రత ఓకే!
మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మేన్’ సినిమా మరో వారంలో విడుదలవుతుందనే తరుణంలో సినిమాలో మహేష్ బాబు-కాజల్ మధ్య ఘాటైన లిప్ లాక్ సీన్ ఉందనే వార్తలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. మహేష్ బాబు ఇదివరకెన్నడూ ఏ హీరోయిన్ తో కూడా లిప్ లాక్ సీన్లలో నటించలేదు కాబట్టి తమ అభిమాన హీరో తెరపై ముద్దు సరసం పండిస్తుంటే చూడాలని ఆశ పడుతున్నారు అభిమానులు. మరి ముద్దు సీన్ వార్త నిజమా? కాదా?అనే సందేహంలో ఉన్న అభిమానులకు దర్శకుడు పూరి జగన్నాధ్ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ...సినిమాలో మహష్ బాబు-కాజల్ మధ్య ముద్దు సీన్ ఉందని కన్ ఫర్మ్ చేశారు. మహేష్ బాబు తన భార్య నమ్రత శిరోద్కర్ అనుమతి మేరకే ముద్దు సీన్ కు ఓకే చేశాడని, సినిమాకు ఎంతో కీలకంగా ఉండే ఆ సీన్ పై ఆమె ఎలాంటి అభ్యంతరం తెలుపకుండా ఓకే చెప్పిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆర్ ఆర్ మూవీ మేకర్స్ నిర్మాణ సార్థ్యంలో మహేష్ బాబు-కాజల్ జంటగా రూపొందిన బిజినెస్ మేన్ జనవరి 13న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Post a Comment