ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ము విశేషాలు రోజు రోజూ బయిటకు వస్తూ అభిమానులను ఆనందంలో ముంచేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రంలో పురాతన కాలంలో జరిగే ఓ పీరియడ్ పాటను చిత్రీకరించనున్నారనే వార్త వచ్చింది. ఎన్టీఆర్,త్రిషలపై చిత్రీకరించే ఈ పాట సినిమా హైలెట్స్ లో ఒకటిగా బోయపాటి శ్రీను భావించి షూట్ చేసతున్నారు. త్రిష,ఎన్టీఆర్ ఇద్దరూ రాజుల కాలంలోలగా ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్ వేసుకుని,పీరియడ్ కాలానికి చెందిన సెట్ లో డాన్స్ చేయనున్నారు. అలాగే సంగీత దర్శకుడు కీరవాణి కూడా ఈ పాటను ప్రత్యేకమైన శ్రద్దతో తీర్చిదిద్దినట్లు చెప్తున్నారు. సినిమాలో ప్రతీ అంశమూ కూడా మాస్ ని ఆకట్టుకుని విజిల్స్ వేయించే రీతిలో బోయపాటి తీర్చిదిద్దుతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఇక దమ్ము చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిష,కార్తిక నటిస్తున్నారు.తొట్టింపూడి వేణు ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి బావగా కనిపించనున్నారు.భానుప్రియ ..ఎన్టీఆర్ కి తల్లిగా చేస్తోంది.ఇలా ఎక్కడా రాజీపడకుండా అద్బుతమైన తారాగణంతో ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేయాలని భావిస్తున్నారు.
అలాగే మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ చిత్రం తో పాటు ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ము టీజర్స్ చూడబోతున్నాం. బిజినెస్ మ్యాన్ ఆడే ధియోటర్స్ లో దమ్ము చిత్రం టీజర్స్ వదిలితే ఎక్కువ మంది చూసే అవకాశముంటుందని దమ్ము నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన టీజర్స్ ని తయారు చేస్తున్నారు. త్రిష ,కార్తీక హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 2012 రెండో వారంలో విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ లావు తగ్గి మరీ స్లిమ్ గా కనపడతానని ఫ్యాన్స్ కి హామీ ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపిస్తారని చెప్పుకుంటున్నారు. మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి ఇప్పటికి నాలుగు పాటలు కంపోజ్ చేసారు. ఇంకా మూడు బ్యాలెన్స్ ఉన్నాయి.

Post a Comment