Home »
» రామ్ చరణ్ రచ్చ లేటెస్ట్ అప్‌డేట్స్
రామ్ చరణ్ రచ్చ లేటెస్ట్ అప్‌డేట్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రచ్చ షూటింగ్ నేటి నుంచి చెన్నయ్ లో జరుపుకోనుంది. ఇక్కడ పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలో భాగంగా రామ్ చరణ్, తమన్నా, ఈ చిత్రంలో విలన్ రోల్ పోషిస్తేున్న అజ్మల్ పై ఫోటో షూట్ నిర్వహించారు. ఇటీవలే రచ్చ యూనిట్ రాజమోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన తమన్నా నటిస్తోంది. మాస్ మసాలా, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పరాస్ జైన్, ఎన్.వి.ప్రసాద్ మెగా సూపర్ గుడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సంక్రాంతి తర్వాత రచ్చ ఫస్ట్ లుక్, ట్రైలర్, ఫిబ్రవరిలో ఆడియో, మార్చిలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
‘రచ్చ’ సినిమా ఓవర్సీస్ రైట్స్ రికార్డు స్థాయిలో రూ. 2.75 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. హరి వెంకటేశ్వర పిక్చర్స్ ఈ హక్కులు దక్కించుకున్నట్లు సమాచారం. ఈ సంస్థ కంప్లీట్ అబ్రాడ్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు, డివిడి రైట్స్ కూడా దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఆరెంజ్ సినిమా విడుదలైన చాలా రోజులకు ‘రచ్చ’ సినిమా విడుదలవుతుండటంతో బిజినెస్ భారీగానే ఉంటుందని అంటున్నారు.
Post a Comment