పూరీ జగన్నాథ్ చిత్రాలంటే... ఇడియట్ నుంచి పోకిరి వరకు సామాన్యుడికి అర్థమయ్యేలా... లాజిక్కుగా డైలాగ్‌లు ఉంటాయి. వాటితోనే సినిమా హిట్ కొడుతుంటుందని అంటున్నారు చాలామంది. పూరీ, మహేష్‌బాబుతో పోకిరి చేసి ఐదేళ్లయింది. మళ్ళీ అంతటి హిట్ కోసం ఎదురుచూసి తాజాగా 'బిజినెస్‌మేన్' తీశారు. ఇప్పుడు అది ప్రేక్షకుల్లో బాగా క్రేజ్ సంపాదించడంతో దానికి సీక్వెల్‌గా తీస్తానని ప్రకటించాడు పూరీ. మంగళవారంనాడు ఆయన చెప్పిన కొన్ని విశేషాలు...
బిజినెస్‌మేన్ ఎంత రేంజ్‌లో ఉంది?
విడుదలైన మూడు రోజులకు గ్రాస్ రూ. 38.16కోట్లు వసూలు చేసింది. 27.35 షేర్ వచ్చింది. 81 ఏళ్ళ ఇండస్ట్రీ కెరీర్‌లో గొప్పరికార్డ్ ఇది.
పోకిరి తర్వాత వచ్చిన మీ కాంబినేషన్ ఎంతమేరకు రీచ్ అయినందని భావిస్తున్నారు?
హ్యూజ్ రెస్పాన్స్‌తో విడుదలైంది. రాజమండ్రి నుంచి చికాగో వరకు సేమ్ రిపోర్ట్. యుఎస్, యుకెలో పెద్ద రెస్సాన్స్ వచ్చింది. పోకిరి తర్వాత వచ్చింది కాబట్టి ఎలా ఉంటుందనే ఇంట్రస్ట్ బాగా క్రియేట్ అయింది. చూశాక అంతా చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు.
ఫ్యాన్స్‌కు ఏ మేరకు రీచ్ అయిందని అనుకుంటున్నారు?
ఫ్యాన్స్‌కు నిజంగానే పండుగ. సంక్రాంతిని వారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వైజాగ్‌కు వెళ్లాను. వారు చాలా థ్యాంక్స్ అంటూ ఎప్లాజ్ చేశారు. 'మా అబ్బాయి'కి హిట్ ఇచ్చావని అంటుంటే నాకే ఆశ్చర్యమేసింది. కృష్ణగారి తరంవారు మా అబ్బాయి అంటే ఫర్వాలేదు. కానీ మహేష్‌బాబు కంటే చిన్నవయస్సు వారు కూడా మా అబ్బాయి అంటుంటే.. కృష్ణగారి అబ్బాయి వారు ఎంత స్వంతవాడిలా భావిస్తున్నారో అర్థమయింది.
హీరో చేత ఎక్కువ డైలాగ్‌లు చెప్పించడానికి కారణం?
పోకిరిలో లిమిట్‌గా డైలాగులు ఉన్నాయి. ఇందులో కాస్త ఎక్కువే. కానీ ఎక్కడ ఎంతమేరకు ఉండాలో అంతే ఉన్నాయి. ఆయన చెప్పే డైలాగ్స్‌లో ఫిలాసఫీ కూడా ఉంది.
ఫిలాసఫీ డైలాగ్‌లు ఎక్కడ వచ్చాయి?
నాలాగా జీవితంలో మోసపోతే ఎవడికైనా వస్తాయి... (పూరీని అతని మేనేజర్ నమ్మించి కోట్ల రూపాయలు నొక్కేశాడు. ఆ షాక్ నుంచి బయటపడటానికి చాలాకాలం పట్టింది. ఆఖరికి భార్య కూడా దూరమయింది కొన్నాళ్ళకు)
మీ సినిమాలో ఎక్స్‌పోజింగ్ బాగానే ఉంటుంది. కానీ ఈ సినిమాలో బ్యాడ్‌బాయ్స్ అనే పాటలో సెన్సార్ కటింగ్‌లున్నాయి?
అవును.. అది.. సెన్సార్ ఆఫీసర్ ధనలక్ష్మికి నచ్చలేదు. అందుకే బ్లర్ వచ్చేలా చూపించాం.
ఉచ్చపోయించడం అనే మాట పెట్టడానికి కారణం?
అందులో తప్పులేదు. మనం పైస్థాయికి వెళ్ళాంటే.. అంత పవర్‌గా ఉండాలి. నేను మిగతా దర్శకుల్ని ఉచ్చపోయించాలి. ఆ మూడ్‌లోకి వెళితే.. కొత్త కథలు, కొత్త సినిమాలు వస్తాయి. అందరూ అలా అనుకుంటేనే పైకి ఎదుగుతారు. అది ఏరంగమైనాసరే.. జనరల్‌గా మనం అనుకున్న మాటల్లోంచి వచ్చినవే.
బాలీవుడ్‌లో ఎవర్ని పెట్టి చేద్దామనుకుంటున్నారు?
ఇంకా ఫైనల్‌కాలేదు. తెలుగులో మహేష్ లాంటి మ్యాజిక్ హీరో కావాలి. అక్కడ అంత హీరో లేడు. రకరకాల హీరోలని వార్తలు వస్తున్నాయి. అవేవి నిజం కాదు. త్వరలో వెల్లడిస్తాను.
బిజినెస్‌మేన్‌కు సీక్వెల్ తీస్తారా?
అవును. షూటింగ్ సమయంలోనే పార్ట్-2 తీయాలని అనుకున్నాం. ఈ సినిమా సక్సెస్‌ను బట్టి ఆలోచించాలనుకున్నాం. ఇప్పుడు ట్రెమండస్ రెన్సాన్స్... అందుకే పార్ట్-2 తీస్తాం. అది కూడా మహేష్‌తోనే.
మహేష్ కాకుండా ఈసినిమా ఎవరితో తీస్తే బాగుంటుందనిపించింది?
అలాంటిది లేదు.. మహేష్ కోసమే రాసిన కథ. ఆయన చేస్తేనే ఇంత రెస్పాన్స్. ప్రపంచవ్యాప్తంగా ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా వచ్చాయి. నాకూ పేరు వచ్చింది.
మరి మొదట సూర్యతో అనుకున్నట్లు వార్తలు వచ్చాయి?
అవును. సూర్యతో అనుకున్నాం. కానీ కుదరలేదు.
రాజమౌళిగారు మీ దగ్గర అసిస్టెంట్‌గా చేయాలని కామెంట్ చేశారు?
నవ్వుతూ... నా సినిమా చూశాక.. ఆయనకు అలా అనిపించి ఉండవచ్చు. సినిమా చూసి బాగా తీశావ్. మంచి పాయింట్ ఎన్నుకుని మహేష్‌ను బాగా చూపావని మెసేజ్ ఇచ్చారు. ఆయనేదో సరదాగా అలా అన్నాడు. కానీ.. నా దగ్గర అసిస్టెంట్‌గా చేస్తాడా? అని ప్రశ్నించారు.
గూండాయిజాన్ని లీగల్ చేయవచ్చుని చెప్పారు. అది సాధ్యమేనా?
సాధ్యమా అసాధ్యమనా అనేది ఆలోచించకూడదు. సినిమాపరంగా చూడాలంటే.. మనకు తెలీని కొన్ని లాజిక్కులు సినిమాలో చాలా ఉంటాయి. అవన్నీ ఆలోచించకుండా... 'నాయకుడు'లో కమల్‌హాసన్ చేశాడు. అందులోనూ లాజిక్ లేదు. ఇదీ అంతే..
'బాడ్‌బాయ్స్' అనేపాటలో కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని కామెంట్లు వస్తున్నాయి?
మనోభావాలు దెబ్బతిన్నాయని అనేవారు కనిపిస్తే చంపేయాలి. మన ఇండియాలోనే ఇలాంటివి చూస్తాం. ఎక్కడా కన్పించవు. ఏ సంఘటన జరిగినా.. దాని గురించి పెద్ద చర్చపెట్టి.. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని చెబుతుంటారు. పనీపాటా లేనివాళ్ళు ఇలాంటివి పట్టించుకుంటారు. కష్టపడి పనిచేసేవారు. పైస్థాయికి వెళ్ళాల్సిన వారికి తమ పనిపైనే శ్రద్ధపెడతారు.. అంటూ ముగించారు.

Post a Comment