.
Home » » రూ. 40లక్షల రాయల్ నెక్లెస్‌కు ఆర్డరిచ్చిన కరీనా కపూర్!

రూ. 40లక్షల రాయల్ నెక్లెస్‌కు ఆర్డరిచ్చిన కరీనా కపూర్!

Written By Hot nd spicy on Friday, 27 January 2012 | 08:52

బాలీవుడ్ ముద్దుగుమ్మ కరీనా కపూర్ రూ.40లక్షల రాయల్ నెక్లెస్‌కు ఆర్డరిచ్చింది. ఈ భారీ విలువ చేసే నెక్లెస్ ఎందుకో తెలుసా.. ఆమె వివాహానికే..!. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ను త్వరలో మనువాడనున్న ఈ ముద్దుగుమ్మ తన వివాహ వేడుక కోసం రూ.40 లక్షల విలువ గల హారానికి ఆర్డరిచ్చింది.

పూర్తిగా మెడకు అతుక్కుపోయే ఈ నెక్లెస్ పెళ్లి దుస్తులకు తగ్గట్లు డిజైన్ చేయబడింది. ఇలాంటి నెక్లెస్‌లను రాయల్ వెడ్డింగ్స్‌లో మాత్రమే చూడవచ్చునని, రాజ్‌కోట్‌కు చెందిన జ్యుయెల్లర్ ఈ నెక్లెస్‌ను డిజైన్ చేయనున్నట్లు సన్నిహితులు తెలిపారు.

ఈ నెక్లెస్ 400 గ్రాముల స్వర్ణం, రత్నాలతో పొదిగించబడి రెండు నెలల కాలంలో తయారుకానుంది. ఇక సైఫ్ అలీఖాన్ కరీనాకు వివాహ కానుకగా వజ్రాల ఉంగరాన్ని ఇవ్వనున్నట్లు సమాచారం.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger