మీరాజాస్మిన్ ప్రధాన పాత్రలో డి.వి.క్రియేషన్స్ బ్యానర్పై షాజియం దర్శకత్వంలో డి.వెంకటేష్ నిర్మించిన చిత్రం 'ది ఐస్'. ఈ సినిమాని చూసిన ప్రేక్షకుల్లో మొదటిరోజు 2 మంది, రెండు,మూడు, నాలుగు, ఐదు, ఆరవ రోజుల్లో ఇద్దరేసి చొప్పున ప్రతి ఒక్కరికి పాతికవేల రూపాయలను ప్రైజ్ మనీగా అందిస్తామని నిర్మాత డి.వెంకటేష్ తెలియజేశారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్లోని ప్రసాద్ల్యాబ్ లో జరిగింది.
ఈ కార్యక్రమంలో నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ ఆడపిల్లలను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా రూపొందించిన వీడియో నా ప్రతి సినిమా ముందు ప్రదర్శిస్తాను. సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న విడుదల చేస్తున్నాం’’అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత డి.వెంకటేష్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, టి.ప్రసన్నకుమార్, మానస్, పద్మిని, ప్రేమ్కుమార్ పాట్రా,సురేష్ కొండేటి, నవీన్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నవీన్ యాదవ్ ప్రసన్నకుమార్లు ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా....
రామ్గోపాల్వర్మతో 365డేస్, పెద్ద వంశీలో వెన్నెల్లో హాయ్ హాయ్..వంటి చిత్రాలను నిర్మించిన వెంకటేష్గారు ఇప్పుడు మూడో ప్రయత్నంగా చేస్తున్న సినిమాయే ‘ది ఐస్’. సైంటిఫిక్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని నవీన్ యాదవ్ అన్నారు నిర్మాత వెంకటేష్ తో మంచి పరిచయం ఉంది. నాకు మంచి మిత్రుడు. గతంలో ఎన్నో మంచి చిత్రాలను చేసిన వెంకటేష్గారు చేస్తోన్న మూడో చిత్రమే పెద్ద సక్సెస్ కావాలి. హర్రర్, థ్రిల్లర్ సినిమాల సక్సెస్ అందుకుంటున్న ఈ ట్రెండ్ లో విడుదల ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్టవుతుందని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం మలయాళంలో పెద్ద విజయాన్ని సాధించింది. అదేవిధంగా తెలుగులోకూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని టి.ప్రసన్నకుమార్ అన్నారు.
మలయాళంలో మంచి విజయానిన సాధించిన ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని, ఈ సినిమాతో నిర్మాత వెంకటేష్ పెద్ద నిర్మాతగా ఎదగాలని కోరుకుంటున్నానని ప్రేమ్ కుమార్ పట్రా అన్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా మలయాళ చిత్రానికి డిఫరెంట్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించాను. మంచి సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీగా నిలుస్తుందని మ్యూజిక్ డైరెక్టర్ కనిష్క అన్నారు.
మీరా జాస్మిన్, బద్రి, శంకర్, సూరజ్, నందు, గీతా విజయన్, సునీల్ సుగడ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: చంద్రమౌళి, ఎడిటర్: నాగిరెడ్డి,మ్యూజిక్: కనిష్క, నిర్మాత: డి.వెంకటేష్, దర్శకత్వం: షాజియం.
Post a Comment