
శ్రీమంతుడు టీజర్లో కనిపించిన కొన్ని షాట్స్ సినిమాలో లేవు. అదేంటని అడిగితే ట్రిమ్మింగ్లో పోయాయ్ అనే సమాధానం వచ్చింది. ఇప్పుడు ఆసీన్లు మళ్లీ కలుపుతున్నారు. శ్రీమంతుడు సినిమాలో ఎడిట్ చేసిన రెండు కీలకమైన సన్నివేశాల్ని శుక్రవారం నుంచి మళ్లీ ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది. శుక్రవారం నుంచి కొత్త శ్రీమంతుడిని థియేటర్లలో చూడొచ్చు. ఇలా సీన్స్ జోడించడం వల్ల రిపీట్ ఆడియన్స్ వస్తారన్నది నిర్మాతల నమ్మకం. కొరటాల శివ తొలిసినిమా మిర్చిలోనూ ఇదే జరిగింది. కోటి రూపాయల ఫైట్ అంటూ.. సినిమా విడుదల అయిన కొన్ని రోజులకు ఓ ఫైట్ యాడ్ చేశారు. దాని వల్ల సినిమాకి ఒరిగిన అదనపు ప్రయోజనం ఏమీ లేదు. మరి శ్రీమంతుడు విషయంలో ఏమవుతుందో??
Post a Comment