సాధారణంగా రిజర్వ్ డ్ గా ఉండి, పంక్షన్స్ కి దూరంగా ఉండే పవన్ కళ్యాణ్ రీసెంట్ గా జులాయి ఆడియో పంక్షన్ కి గెస్ట్ గా రావటానికి కమిటయ్యారని సమాచారం. మొదట పెద్దగా ఆసక్తి చూపకపోయినా త్రివిక్రమ్ పట్టుదలతో ఒప్పుకున్నాడని తెలుస్తోంది. త్రివిక్రమ్ తో జల్సా సమయం నుంచి మంచి స్నేహం ఉంది. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం సైతం రూపొందనుంది. మొన్న విడుదలైన గబ్బర్ సింగ్ లో సైతం త్రివిక్రమ్ స్క్ర్రిప్టు సాయిం చేసారు. అలాగే తీన్ మార్ చిత్రానికి సైతం త్రివిక్రమ్ డైలాగులు రాసి తన స్నేహం నిలబెట్టుకున్నారు. ఈ నేపధ్యంలో వీరిద్దరి స్నేహ బంధం బాగా బలపడింది. దాంతో జులాయికి త్రివిక్రమ్ దర్శకుడు కావటంతో రిక్వెస్ట్ చేసుకుని పవన్ ని ఒప్పించుకున్నాడని సమాచారం.
ఈ ఆడియో పంక్షన్ కి రామ్ చరణ్,పవన్ కళ్యాణ్ ఇద్దరూ వస్తున్నారని సమాచారం. ఈ ఆడియో పంక్షన్ ఈ నెల పదవ తేదీన హైదరాబాద్ లోని హెఐసిసి లో జరగనుంది. జల్సా,మగధీర తర్వాత మెగా ఫ్యామిలీ మొత్తం ఆడియో ఫంక్షన్ కి హాజరవుతున్న వేదిక ఇదే. అల్లు అర్జున్,ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్టనర్ 'జులాయి'. ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకన్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. గబ్బర్ సింగ్ తో ఊపు మీదున్న దేవి ఈ ఆడియోని అదరకొట్టాడని చెప్తున్నారు.
జీవితాన్ని తేలిగ్గా తీసుకొనే యువకుడి చుట్టూ మా 'జులాయి' కథ తిరుగుతుంది. అలాగే...జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగో చాలామందికి తెలీదు. పరుగులు తీసే వయసులో చదువు, ఉద్యోగం.. అంటూ ముందర కాళ్లకు బంధమేసుకొంటారు. అన్నీ అందాక... ఇక పరిగెట్టే ఓపిక ఉండదు. అందుకే జోష్ ఉన్నప్పుడే జల్సా చేయాలి... అన్నది ఆ కుర్రాడి సిద్ధాంతం. జులాయి, దేశముదురు అని పిలుస్తారేమో అన్న బెంగలేదు. ఈ బిరుదులుంటేనే అమ్మాయిలు సులభంగా ప్రేమలో పడిపోతారనేది అతని నమ్మకం. అదే నిజమైంది. ఓ అందాల భామ ఈ జులాయికి మనసిచ్చేసింది. ఆ తరవాత ఏం జరిగిందో తెరపైనే చూడాలి అన్నారు నిర్మాత ఎస్.రాధాకృష్ణ.
అలాగే కథానుగుణంగానే కాక, పాత్రోచితంగా కూడా ఈ చిత్రానికి ‘జులాయి’ పేరే సరైనది అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్ణయించారు. ఇందులో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ప్రేక్షకుల్లోకి బుల్లెట్స్‌లా దూసుకుపోతాయని, అవి అల్లు అర్జున్ నోట ఆటంబాంబుల్లా పేలతాయని సమర్పకుడు డీవీవీ దానయ్య చెబుతున్నారు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, సోనుసూద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తులసి, ప్రగతి, హేమ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment