ఎస్.ఎస్.రాజమౌళి 'ఈగ' చిత్రం రిలీజ్ లేటవుతున్న సంగతి తెలిసిందే. విడుదల తేదీ కూడా ప్రకటించిన తర్వాత 'ఈగ' విడుదల వరుసగా వాయిదా పడుతోంది. స్టార్ డైరక్టర్ రాజమౌళి సినిమా కావటంతో ఈ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించిన అప్పుడల్లా మిగతా సినిమాల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. తొలుత ఏప్రిల్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించిన నిర్మాతలు ఇప్పుడు జూన్ నెలాఖరున కూడా చేయలేకపోతున్నారని సమాచారం. దీనికి రీజన్ ఏమిటి అనేది అందరి మదిలో కలిగే సందేహం.
విశ్వసనీయ సమాచారం ప్రకారం 'ఈగ' ఆలస్యానికి కారణం గ్రాఫిక్ వర్క్ పూర్తికాకపోవడమే నని తెలుస్తోంది. ఈ చిత్రంలో సింహ భాగం గ్రాఫిక్ తో నిండి ఉంటుంది. దాంతో ఈ గ్రాఫిక్ పనిని విభజించి పలువురికి అప్పజెప్పారు. వీరిలో కొందరు పూర్తిచేస్తే మరికొంత మంది సకాలంలో పూర్తిచేయక పోవడంతో వర్క్ ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో సమస్య వచ్చింది. ఈ కారణంగా జూన్‌లో విడుదల చేయడం కూడా కష్టమని సమాచారం.
ఇక ఈగ చిత్రాన్ని చిత్రం కథ గురించి రాజమౌళి మీడియా తో మాట్లాడుతూ...
చీమ - ఏనుగూ మధ్య గొడవ జరిగితే ఎవరు గెలుస్తారు? దోమతో సింహం ఫైటింగుకి దిగితే ఏం జరుగుతుంది? రెండు ప్రశ్నలకూ ఒకటే సమాధానం. అల్పప్రాణులపై బలవంతులదే రాజ్యం. అయితే ఈ అహంకారం, అతి విశ్వాసం అప్పుడప్పుడూ చేటు తీసుకొస్తుంది. ఆ కథ తాబేలు, కుందేలూ పరుగుపందెంలా ఉంటుంది. ఇక్కడ కూడా ఓ 'ఈగ' మనిషిపై పోటీకి దిగింది. మరి గెలిచిందా? లేదా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే 'ఈగ' సినిమా చూడాల్సిందే.
'ఓ దుర్మార్గుడితో 'ఈగ' చేసిన పోరాటం ఈ కథ. అలాగని ఈగని ఆకాశమంత పెద్దదిగా చూపించడం లేదు. దానికేం అద్భుత శక్తుల్ని ఆపాదించడం లేదు. సాధారణ పరిమాణంలోనే ఉంటుంది. అయినా పోరాడుతుంది. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేశాం. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేస్తామని అన్నారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులు. సాయి కొర్రపాటి నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు చెబుతూ 'సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్, సమర్పణ: డి.సురేష్‌బాబు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment