అసిస్టెంట్ దర్శకుడి నుంచి హీరోగా మారి అలా మొదలైంది, పిల్లజమిందార్‌తో తనకంటూ ప్రత్యేకతను తెచ్చుకున్న నాని గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కూడా నటించాడు. ఆ చిత్రం తనకు మంచిపేరు తెచ్చిపెడుతున్నట్లు వెల్లడించాడు. అయితే కాస్త బాధను వ్యక్తం చేశాడు కూడా.
రాజమౌళి సినిమాలో నటించడం ఆనందంకంటే.. సినిమా అంటేనే ఈగ అనేది పెద్దగా ప్రచారం జరిగిపోయింది. నాని చనిపోతాడు. ఈగగా మారతాడు. ఇది కాన్సెప్ట్. నాని పాత్ర నామమాత్రం. అందుకే గ్రాఫిక్ ఈగను పెట్టి సినిమా తీశాడు. మూడు భాషల్లో విడుదలవుతున్నా... నాని పేరుకంటే.. ఈగ పేరును, విలన్ సుదీప్ పేరును చెప్పుకుంటున్నారు. నానిని మర్చిపోయారు.
ట్రైలర్స్‌లో ఈగ, విలన్‌దే పైచేయిగా ఉంది. ఏదో ఒక సీన్‌లో తనున్నాని నాపేరు నాని ఈగగా మారాను.. అంటూ క్లిప్పింగ్ వస్తుంది. ఇటీవలే దీనికి ఆర్‌ఆర్ చేసిన కీరవాణి కూడా విలన్‌ను మెచ్చుకోవడం నానికి మింగుడుపడటంలేదు. గతంలో కూడా రాజమౌళి సినిమాలు పెద్ద హీరోలతో చేసినా దర్శకుడికే పేరు వచ్చింది. అందుకే ఆయనతో సినిమా చేస్తే ఒకపక్క ఆనందం మరోపక్క బాధను కల్గిస్తాయని పరిశీలకులు చెబుతున్నారు.
Post a Comment