ప్రస్తుత ట్రెండ్‌లో సామాజిక వెబ్‌సైట్ల హవా అంతా ఇంతా కాదు. సామాన్యులే కాదు.. సినీ స్టార్లు కూడా ఫేస్‌బుక్, ట్విట్టర్లను తెగ వాడేస్తున్నారు. సన్నీ లియోన్, పూనమ్ పాండే లాంటి సెక్సీ భామలు తమ అందచందాలను ప్రేక్షకుల కోసం సోషల్ నెట్‌వర్క్‌ల్లో పోస్ట్ చేస్తున్నారు. అయితే తెల్లపిల్ల, రచ్చ హీరోయిన్ తమన్నా మాత్రం నాకు సోషల్ నెట్‌వర్క్ సైట్స్‌లో అకౌంట్ లేదంటోంది. తన పేరుతో ఫేస్‌బుక్ ప్రొఫైల్స్ చూశానని, కానీ నాకు సొంత అకౌంట్ లేదని తమన్నా స్పష్టం చేసింది.
ఆర్కూట్, ట్విట్టర్, ఫేస్ బుక్‌లను సినీ తారలు ఉపయోగించడం పరిపాటి అయ్యింది. అయితే సినీ తారల పేరుతో కొన్ని నకిలీ అకౌంట్లు కూడా వస్తున్నాయని, ఇదే తరహాలో తన పేరుతో కొన్ని ప్రొఫైల్స్ ఉన్నాయని చెప్పింది. కానీ నాకు సోషల్ నెట్‌వర్క్ సైట్‌లో ఎలాంటి అకౌంట్ లేదని చెప్పింది.
మరోవైపు తమిళంలో ఈ ఏడాది తమన్నా సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. దీనిపై తమన్నా స్పందిస్తూ.. తెలుగు సినిమాలతో బిజీబిజీగా ఉండటం వల్లే తమిళ సినిమాల్లో నటించలేకపోతున్నానని చెప్పింది. మంచి కథ దొరికితే తమిళ సినిమాలో నటించేందుకు సిద్ధంగా ఉన్నాను. కాగా, ప్రస్తుతానికి తమన్నా పవన్ కళ్యాణ్ సరసన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో నటిస్తోంది.
| Share with Friends : |
| Share with Friends : |

Post a Comment