ఎప్పుడైనా ఓసారి అయితే సంతోషం...అప్పుడప్పుడు అయితే వ్యసనం, ఎప్పుడూ అదే పని చేస్తే రోగం....తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. సిగరెట్ మత్తుకు బానిసైన షారుఖ్ ఇటీవల పలు సందర్భాల్లో నిషేదాజ్ఞలను ఉల్లంఘించి కోర్టు నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే.
ఎన్ని ప్రయత్నాలు చేసినా అదేదో ఎప్పుడూ వంకరే అన్నట్లు...షారుఖ్ కూడా పొగ త్రాగడాన్ని వదల్లేక పోతున్నారు. తాజాగా కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి సతీమణితో హాజరైన ఈ సూపర్ స్టార్ మళ్లీ పబ్లిగ్గా దమ్ము కొడుతూ మీడియాకు చిక్కారు. అందమైన డ్రెస్‌లో షారుఖ్ భార్య గౌరీ అందరినీ ఆకట్టుకుంటే ఖాన్ సాబ్ మాత్రం దమ్ము కొడుతూ నిరాశ పరిచాడు.
గతంలో జైపూర్ లోని స్వాభిమాన్ స్టేడియంలో ఏప్రిల్ 8న రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా షారుఖ్ అందరి మధ్య సిగరెట్లు కాల్చారు. బహిరంగంగా పొగ తాగకూడదన్న నిబంధనలను ఉల్లంఘించారని ఆయనపై ఇక్కడి స్థానిక కోర్టులో జైపూర్ క్రికెట్ అకాడెమీ డైరెక్టర్ ఆనంద్ సింగ్ రాథోడ్ తరఫున న్యాయవాది నేంసింగ్ రాథోడ్ ఈ కేసు దాఖలు చేశారు. ఈ కేసులో ఆయనకు కోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Post a Comment