'జులాయి'ది రాజీపడని తత్వమంటున్న నిర్మాత!
జులాయిలా కనిపించినా అతను చేసే ప్రతి పనికి ఓ అర్థం ఉంటుందని, దేనికీ రాజీపడని తత్వం అతని సొంతమని ఆ చిత్ర నిర్మాత ఎన్.రాధాకృష్ణ. అలాంటి జులాయి యువకుడు ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏం జరిగింది? అందాల ముద్దుగుమ్మ ప్రేమ కోసం జులాయి కుర్రాడు ఏం చేశాడు? ఇలాంటి అంశాలన్నీ ఈ చిత్రంలో ఆసక్తి కలిగించేలా సాగుతాయని ఆయన అంటున్నాడు. అల్లు అర్జున్ హీరోగా, ఇలియాన కథానాయికగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హరిక అండ్ హాసిని పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం "జులాయి". ఈ చిత్ర విశేషాలపై నిర్మాత మాట్లాడుతూ... ప్రస్తుతం అల్లు అర్జున్‌పై శేఖర్ మాస్టర్ నేతృత్వంలో జులాయి టైటిల్ సాంగ్‌ని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్నామన్నారు. దేవీశ్రీప్రసాద్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన చిత్రాల తరహాలోనే ఇటీవల విడుదలైన జులాయి ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. దేవీ చక్కని సంగీతం అందించాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని చెప్పారు.
Post a Comment